India vs Bangladesh: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌.. జట్టులోకి మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ జట్టు ఆడుతోంది.

Mayank Yadav, Nitish Kumar Reddy make India T20I debuts

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ జట్టు ఆడుతోంది.

టీ20ల్లోకి మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశారు. ఇటీవలే బంగ్లాదేశ్‌ను భారత్ టెస్టు సిరీస్‌లో 2-0 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్‌ జట్టు: లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం

Shivam Dube: రోహిత్, ధోనీలో ఎవరు బెస్ట్ కెప్టెన్.. శివమ్ దూబె ఏం చెప్పాడో తెలుసా.. వీడియో వైరల్