Shivam Dube: రోహిత్, ధోనీలో ఎవరు బెస్ట్ కెప్టెన్.. శివమ్ దూబె ఏం చెప్పాడో తెలుసా.. వీడియో వైరల్

భారత సారథి రోహిత్ శర్మ, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీలలో ఎవరు కెప్టెన్సీ బెస్ట్.. ఎవరి కెప్టెన్సీని నువ్వు ఇష్టపడతావు అంటూ కపిల్ శర్మ దూబెను ప్రశ్నించాడు.

Shivam Dube: రోహిత్, ధోనీలో ఎవరు బెస్ట్ కెప్టెన్.. శివమ్ దూబె ఏం చెప్పాడో తెలుసా.. వీడియో వైరల్

Rohit Sharma and Shivam Dube

Updated On : October 6, 2024 / 2:43 PM IST

Shivam Dube in Kapil Sharma Show: భారత్ క్రికెటర్ శివమ్ దూబె ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. దూబెతోపాటు రోహిత్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ కూడా ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. కపిల్ శర్మ మాట్లాడుతూ.. శివమ్ దూబెను ఓ ప్రశ్న అడిగాడు. ప్రస్తుత భారత సారథి రోహిత్ శర్మ, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీలలో ఎవరు కెప్టెన్సీ బెస్ట్.. ఎవరి కెప్టెన్సీని నువ్వు ఇష్టపడతావు అంటూ ప్రశ్నించాడు. దీంతో తొలుత దూబె కాస్త తటపటాయించినా ఆ తరువాత తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దూబె చెప్పిన సమాధానంకు నెటిజన్లు సైతం ప్రశంసలు కురింపించారు.

Also Read : IND vs BAN T20: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే.. ఎందుకంటే?

కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు దూబె సమాధానం ఇస్తూ.. నేను చెన్నై తరపున ఆడేటప్పుడు ఎంఎస్ ధోనీ నా బెస్ట్ కెప్టెన్.. అదే నేను భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు రోహిత్ శర్మ నా బెస్ట్ కెప్టెన్ అంటూ బదులిచ్చాడు. దీంతో కపిల్ శర్మతోపాటు షోలో ఉన్న రోహిత్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ అంతా నవ్వేశారు. దూబె సమయస్ఫూర్తితో తెలివిగా సమాధానం ఇచ్చాడంటూ ప్రశంసించారు. రోహిత్ శర్మ అయితే.. సూపర్ గా సమాధానం చెప్పావ్ అంటూ సైగ చేశాడు.

Also Read : IND vs BAN First T20: సుందర్, రింకూ బ్యాటింగ్ చేస్తుండగా సూర్య కేకలు వేస్తూ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్

బంగ్లాదేశ్ జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు శివమ్ దూబె టీమిండియా జట్టులో ఎంపికయ్యాడు. అయితే, గాయం కారణంగా తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే దూబె సిరీస్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దూబె స్థానంలో బీసీసీఐ తిలక్ వర్మను ఎంపిక చేసింది.