IND vs BAN T20: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే.. ఎందుకంటే?

న్యూజిలాండ్ తో త్వరలో జరగాల్సిన టెస్టు సిరీస్ నేపథ్యంలో గిల్, పంత్, జైస్వాల్, సిరాజ్, అక్షర్ పటేల్ వంటి ప్లేయర్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. సంజు శాంసన్, మయాంక్ యాదవ్ ..

IND vs BAN T20: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే.. ఎందుకంటే?

IND vs BAN T20 Match

Updated On : October 6, 2024 / 8:57 AM IST

IND vs BAN T20 Match: బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జట్టు మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ ఆడనున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు టెస్టు మ్యాచ్ లో ఓడిపోయిన బంగ్లా జట్టు.. టీ20 మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే, యువ ప్లేయర్లతో సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని భారత్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. టీ20 మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్న బంగ్లాదేశ్ జట్టుకు ఆల్ రౌండర్ షకీబ్ లేకపోవటం పెద్ద లోటే. అతడు ఇటీవలే టెస్టు, టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, మహ్మదుల్లా, ముస్తాఫిజుర్, లిటన్ దాస్, తస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉండటం బంగ్లాకు కాస్త ఊరటనిచ్చే అంశం. మరోవైపు భారత్ జట్టులో ప్రముఖంగా ఇద్దరు ప్లేయర్లపై అందరి చూపు ఉంది.

Also Read : IND vs PAK: గెలిచి తీరాల్సిందే.. పాక్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధమైన భారత్.. మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది.. ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలంటే..?

న్యూజిలాండ్ తో త్వరలో జరగాల్సిన టెస్టు సిరీస్ నేపథ్యంలో గిల్, పంత్, జైస్వాల్, సిరాజ్, అక్షర్ పటేల్ వంటి ప్లేయర్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. సంజు శాంసన్, మయాంక్ యాదవ్ పై అందరి దృష్టి ఉంది. సంజూ శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో పలు మ్యాచ్ లలో విఫలం కావటంతో సంజూకు తుది జట్టులో అవకాశాలు తక్కువగానే లభిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెనర్ గా క్రీజులోకి రాబోతున్న సంజూ శాంసన్ ప్రదర్శన ఏ విధంగా ఉంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు యువ స్పీడ్ బౌలర్ మయాంక్ యాదవ్ పై అందరి కళ్లూ ఉంటాయనడంలో సందేహం లేదు. తన తొలి ఐపీఎల్ లో ఈ ఏడాది నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో మయాంక్ బంతులేశాడు. తద్వారా క్రికెట్ ప్రపంచం దృష్టిలో పడ్డాడు. కానీ, పక్కటెముకల గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగాడు.

Also Read : IPL 2025 : ఆ రూల్‌ను మార్చండి మ‌హాప్ర‌భో.. బీసీసీఐకి ఫ్రాంఛైజీల విన‌తి!

సాధారణంగా జాతీయ జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలంటే గాయం నుంచి కోలుకున్న ఏ ఆటగాడైనా రంజీ క్రికెట్ లో తన ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ, 22ఏళ్ల మయాంక్ యాదవ్ ను సెలెక్టర్లు నేరుగా జట్టులోకి తీసుకున్నారు. అతడిపై మంచి అంచనాలే ఉన్నాయి. మయాంక్ ఫిట్ నెస్, నైపుణ్యాలకు ఈ సిరీస్ పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. దీంతో మయాంక్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకుంటే ఏ మేరకు రాణిస్తాడనే అంశం క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ఆల్ రౌండర్ శివమ్ దూబె గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో తిలక్ వర్మ కు అవకాశం దక్కింది. ఈ యువ బ్యాటర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగిస్తాడు. అయితే, తుది జట్టులో వర్మకు అవకాశం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.