IPL 2025 : ఆ రూల్‌ను మార్చండి మహాప్రభో.. బీసీసీఐకి ఫ్రాంఛైజీల వినతి!
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు.

IPL Team owners lodge complaint with BCCI on new rtm rule
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ వేలానికి సంబంధించిన రిటైన్షన్ రూల్స్‌ను ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్)ను మళ్లీ ప్రవేశపెట్టింది. ఆర్‌టీఎమ్ కార్డుతో పాటు రిటైన్షన్ విధానంలో మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ప్రతి ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు. ప్రతి జట్టు పర్సు వాల్యూను రూ.120 కోట్లకు పెంచింది.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాలి. ఇక నాలుగో, ఐదో ఆటగాడిని తీసుకోవాలంటే మళ్లీ రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రతి ఫ్రాంఛైజీ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు అక్టోబర్ 31 డెడ్‌లైన్‌గా విధించారు.
Ravichandran Ashwin : పాక్ క్రికెట్ ప్రస్తుత పరిస్థితి పై రవిచంద్రన్ అశ్విన్
కాగా.. ఆర్‌టీఎమ్ రూల్ పై ప్రాంఛైజీలు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ మరోసారి పునరాలోచన చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఆర్‌టీఎమ్ రూల్‌లో ఏముందంటే..?
మెగా వేలానికి వదిలి వేసిన ఆటగాళ్ల నుంచి ప్రాంఛైజీ ఒక ఆటగాడిని ఆర్‌టీఎమ్ కార్డు ద్వారా తిరిగి దక్కించుకోవచ్చు. గతంలో ఈ రూల్ ప్రకారం వేలంలో ఆటగాడికి లభించిన బిడ్‌తోనే పాత ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసేది. అయితే.. ఈ సారి రూల్ కాస్త మార్చింది బీసీసీఐ. బిడ్ వేసిన టీమ్‌కు సదరు ప్లేయర్‌ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేయవచ్చు. దీంతో ఆ ధరను చెల్లిస్తేనే ఆర్‌టీమ్ కింద పాత ప్రాంఛైజీ అతడిని తీసుకోవచ్చు.
ఉదాహరణకు.. ముంబై ఇండియన్స్ కు చెందిన రోహిత్ శర్మను ఆ జట్టు మెగా వేలంలోకి వదిలివేసిందని అనుకుందాం. వేలంలో అతడి కోసం ఆర్‌సీబీ రూ.14 కోట్లకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పుడు ముంబై ఆర్‌టీఎమ్ కార్డుతో రోహిత్‌ను తీసుకోవాలని అనుకుంది. పాత రూల్ ప్రకారం అయితే రూ.14 కోట్లకు రోహిత్‌ను ముంబై తీసుకోవచ్చు. అయితే.. కొత్త రూల్ ప్రకారం ఆర్‌సీబీ మరోసారి బిడ్ వేయవచ్చు. అప్పుడు ఆర్‌సీబీ 18 కోట్లకు బిడ్ వేస్తే అంతే మొత్తం చెల్లించి ముంబై తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆర్‌సీబీకి రోహిత్ దక్కుతాడు.