IND vs BAN First T20: సుందర్, రింకూ బ్యాటింగ్ చేస్తుండగా సూర్య కేకలు వేస్తూ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్
బంగ్లాదేశ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా భారత్ క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. నెట్స్ లో వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ బ్యాటింగ్ చేస్తుండగా

Suryakumar Yadav
Suryakumar Yadav: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ (ఆదివారం) జరగనుంది. సాయంత్రం 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టును ఢీకొట్టనుంది. ఇప్పటికే టీమిండియాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లలో ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టు.. టీ20 మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, భారత్ జట్టు యువ ప్లేయర్లతో ఊత్సాహంతో ఉంది. అన్ని విభాగాల్లో బంగ్లాపై పైచేయిగానే ఉండటంతో ఈ మ్యాచ్ లో భారత్ జట్టు విజయం నల్లేరుపై నడకే అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
Also Read : IND vs BAN T20: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే.. ఎందుకంటే?
బంగ్లాదేశ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా భారత్ క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. నెట్స్ లో వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ బ్యాటింగ్ చేస్తుండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వారిని ప్రోత్సహిస్తూ ఉత్సాహపర్చాడు. ముఖ్యంగా సుందర్ ఆడుతున్న షాట్స్ ను చూసి.. వావ్ సూపర్ షాట్.. బలంగా కొట్టు అంటూ సూర్యకుమార్ ఉత్సహపర్చాడు. ఈ క్రమంలో సుందర్ ను ‘గబ్బా’ అంటూ సూర్య సంబోధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. భారత్ ఆటగాళ్ల ఉత్సాహం చూస్తుంటే బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
Suryakumar Yadav describing Indian batters in nets. 😂👌
– Sundar being addressed as ‘Gabba’. pic.twitter.com/B6V0DYdVGE
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 6, 2024