IND vs BAN 2nd Test : భారీ వ‌ర్షం.. తొలి రోజు మిగిలిన ఆట ర‌ద్దు

కాన్పూర్ వేదిక‌గా భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND vs BAN 2nd Test

ముగిసిన తొలి రోజు ఆట‌..
భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో తొలి రోజు మిగిలిన ఆట‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. బంగ్లాదేశ్ స్కోరు 35 ఓవ‌ర్ల‌లో 107/3. క్రీజ్‌లో ముష్ఫికర్ (6), మోమినుల్ హక్ (40) లు ఉన్నారు.

వ‌ర్షం అంత‌రాయం.. 
వెలుతురు లేమి కార‌ణంగా మ్యాచ్ ఆగిపోయింది. అదే సమ‌యంలో వ‌ర్షం కూడా ప‌డుతోంది. దీంతో పిచ్ మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ స్కోరు 35 ఓవ‌ర్ల‌లో 107/3. క్రీజ్‌లో ముష్ఫికర్ (6), మోమినుల్ హక్ (40) లు ఉన్నారు.

నజ్ముల్ హొస్సేన్ శాంటో ఔట్‌..
బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌లో నజ్ముల్ హొస్సేన్ శాంటో (31) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 80 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

లంచ్ బ్రేక్‌.. 
బంగ్లాదేశ్ నిల‌క‌డ‌గా ఆడుతోంది. కాన్పూర్ టెస్టు మ్యాచులో తొలి రోజు లంచ్ విరామానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల న‌ష్టానికి 74 ప‌రుగులు చేసింది. మోమినుల్ హక్ (17), నజ్ముల్ హొస్సేన్ శాంటో (28) లు క్రీజులో ఉన్నారు.

షాద్‌మాన్‌ ఇస్లాం ఔట్‌..
బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో షాద్‌మాన్‌ ఇస్లాం (36 బంతుల్లో 24 ప‌రుగులు) ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 29 ప‌రుగుల వ‌ద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోర్‌ 37/2. మోమినుల్ హక్ (0), నజ్ముల్ హొస్సేన్ శాంటో (8) లు క్రీజులో ఉన్నారు.

జాకీర్ హసన్ డ‌కౌట్‌
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు షాక్ త‌గిలింది. ఆకాష్ దీప్ త‌న తొలి ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ జాకీర్ హసన్ ను ఔట్ చేశాడు. 24 బంతులు ఆడిన జాకీర్ ఒక్క ప‌రుగు చేయ‌కుండానే య‌శ‌స్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవ‌డంతో డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 9 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 26/1. షాద్మాన్ ఇస్లాం (21), మోమినుల్ హక్ (0) లు క్రీజులో ఉన్నారు.

బంగ్లాదేశ్ జ‌ట్టు..
షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(వికెట్ కీప‌ర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్

భార‌త జ‌ట్టు..
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్

టాస్‌..
టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టు మ్యాచులో ఆడిన టీమ్‌తోనే బ‌రిలోకి దిగుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. జ‌ట్టులో ఎలాంటి మార్పు లేద‌న్నాడు.

కాన్పూర్ వేదిక‌గా భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. ఉద‌యం 9 గంట‌ల‌కే టాస్ వేయాల్సి ఉంది. అయితే.. గురువారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌గా మారింది. మైదానాన్ని ప‌రిశీలించిన అంపైర్లు ఉద‌యం 10 గంట‌ల‌కు టాస్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు. 10.30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల ప్లేయ‌ర్లు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు.