IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీసుల్లో అత్య‌ధిక ప‌రుగులు, వికెట్లు తీసిన ఆట‌గాళ్లు ఎవ‌రంటే?

సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది.

India vs Bangladesh head to head records ahead of two match Test series

India vs Bangladesh : సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది. తొలి టెస్టు మ్యాచ్ సెప్టెంబ‌ర్ 19 నుంచి సెప్టెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచులో చోటు ద‌క్కించుకోవాలంటే ప్ర‌తి టెస్టు మ్యాచ్ భార‌త్‌కు కీల‌క‌మే.

ఈ క్ర‌మంలో డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న భార‌త్.. బంగ్లాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి త‌న స్థాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు పాకిస్థాన్‌ను పాక్ గ‌డ్డ‌పైనే ఓడించి చ‌రిత్ర సృష్టించిన‌ బంగ్లాదేశ్‌.. భార‌త గ‌డ్డ‌పై కూడా స‌త్తాచాటాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ సిరీస్ హోరాహోరీగా జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

Mohammed Shami : అయ్యో పాపం.. ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన ష‌మీ.. స్పందించిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌

ఇక ఇరు జట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 13 టెస్టు మ్యాచుల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 11 మ్యాచుల్లో గెల‌వ‌గా మ‌రో రెండు టెస్టులు డ్రా గా ముగిసాయి. బంగ్లాపై భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టుల్లో ఎప్పుడూ ఓడిపోలేదు.

భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ 820 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత 604 ప‌రుగుల‌తో బంగ్లా ఆట‌గాడు ముష్ఫికర్ రహీమ్ రెండో స్థానంలో ఉన్నాడు.

భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట‌ర్లు..

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. అశ్విన్ భార్య ఆస‌క్తిక‌ర పోస్ట్‌..

* సచిన్ టెండూల్కర్ – 820 పరుగులు
* ముష్ఫికర్ రహీమ్ – 604 పరుగులు
* రాహుల్ ద్రవిడ్ – 560 పరుగులు
* ఛెతేశ్వర్ పుజారా – 468 పరుగులు
* విరాట్ కోహ్లీ – 437 పరుగులు

31 వికెట్లు తీసి జ‌హీర్ ఖాన్ ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత ఇషాంత్ శ‌ర్మ‌, అశ్విన్‌లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్ శ‌ర్మను ఊరిస్తున్న ‘సిక్స‌ర్ల’ రికార్డు..

* జహీర్ ఖాన్ – 31 వికెట్లు
* ఇషాంత్ శర్మ – 25 వికెట్లు
* ఆర్ అశ్విన్ – 23 వికెట్లు
* ఉమేష్ యాదవ్ – 22 వికెట్లు
* షకీబ్ అల్ హసన్ – 21 వికెట్లు