IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్ శ‌ర్మను ఊరిస్తున్న ‘సిక్స‌ర్ల’ రికార్డు..

సుదీర్ఘ విరామం త‌రువాత భార‌త జ‌ట్టు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌నుంది.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్ శ‌ర్మను ఊరిస్తున్న ‘సిక్స‌ర్ల’ రికార్డు..

Rohit Sharma on the way to break Sehwag ALL TIME Test record

Updated On : September 14, 2024 / 4:10 PM IST

India vs Bangladesh : సుదీర్ఘ విరామం త‌రువాత భార‌త జ‌ట్టు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌నుంది. దాదాపు 45 రోజుల విరామం అనంత‌రం భార‌త్ సొంత‌గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది. సెప్టెంబ‌ర్ 19 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. కాగా.. బంగ్లాతో సిరీస్ నేప‌థ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఓ రికార్డు ఊరిస్తోంది.

రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెప్టెంబ‌ర్ 19 నుంచి చెన్నై వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గ‌నుక హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రో 7 సిక్స‌ర్లు కొడితే.. టెస్టు క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.

Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

సెహ్వాగ్ 103 టెస్టులు ఆడాడు. 178 ఇన్నింగ్స్‌ల్లో 90 సిక్స‌ర్లు బాదాడు. ఇక రోహిత్ శ‌ర్మ 59 టెస్టులు ఆడాడు. 101 ఇన్నింగ్స్‌ల్లో 84 సిక్స‌ర్లు కొట్టాడు. ఇక ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌రువాత టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ధోని 90 టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌లు ఆడి 78 సిక్స‌ర్లు బాదాడు.

టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు..

* వీరేంద్ర సెహ్వాగ్ – 103 టెస్టుల్లో 90 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 59 టెస్టుల్లో 84 సిక్స‌ర్లు
* మ‌హేంద్ర సింగ్ ధోని – 90 టెస్టుల్లో 78 సిక్స‌ర్లు
* స‌చిన్ టెండూల్క‌ర్ – 200 టెస్టుల్లో 69 సిక్స‌ర్లు
ర‌వీంద్ర జ‌డేజా – 72 టెస్టుల్లో 64 సిక్స‌ర్లు.

MS Dhoni : ధోనికి కోపం వ‌స్తే.. జ‌రిగేది ఇదే.. సీఎస్‌కే మాజీ ఆట‌గాడి వ్యాఖ్య‌లు వైర‌ల్‌

ఇదిలా ఉంటే.. భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య చెన్నై వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జ‌ట్టును బీసీసీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర‌ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాష్ దీప్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, యశ్ దయాల్.