MS Dhoni : ధోనికి కోపం వస్తే.. జరిగేది ఇదే.. సీఎస్‌కే మాజీ ఆటగాడి వ్యాఖ్యలు వైరల్
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోడు.

MS Dhoni Lost His Cool, Kicked Water Bottle Out Of The Park
MS Dhoni – CSK : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోడు. ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. మ్యాచ్ గెలిచినా, ఓడినా సరే ఒకే విధంగా ఉంటాడు. అందుకనే అతడిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. ఇక అతడు మైదానంలో ఆటగాళ్ల పై కోప్పడిన సందర్భాలు చాలా అరుదు. అయితే.. ధోని ఆగ్రహాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్‌లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు ఆడడం పై అయోమయం నెలకొంది. ఈ తరుణంలో ధోని ఆగ్రహం గురించి బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Sanju Samson : ఇలాగైతే ఎలా..? ఏం మాత్రం మారని సంజూ శాంసన్!
ధోని కూడా అందరి లాంటి వాడేనని అన్నాడు. అతడు అప్పుడప్పుడు సంయమనాన్ని కోల్పోతూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. అయితే.. మైదానంలో మాత్రం ఇలా చేయడం చాలా అరుదు అని అన్నాడు. ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థి ఆటగాళ్లు భావించకూడదనేది ధోని ఆలోచన అని తెలిపాడు. కానీ.. ఓ ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ధోని ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పాడు.
అయితే ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిందన్నాడు. ‘చెన్నై వేదికగా ఆర్‌సీబీతో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగాం. స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయి మ్యాచ్‌లో ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లో నేను అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో షాట్ కోసం యత్నించి ఎల్బీగా ఔట్ అయ్యాను. డ్రెస్సింగ్ రూమ్ పక్కనే వచ్చి నిలుచున్నాను. అదే సమయంలో ధోని వస్తున్నాడు. అక్కడ ఓ చిన్న వాటర్ బాటిల్ ఉంది. ఆగ్రహంతో ఉన్న ధోని దానిని చాలా బలంగా తన్నేశాడు. దీంతో అతడి కళ్లలోకి చూసేందుకు కూడా నేను ప్రయత్నించలేదు.’ అని బద్రీనాథ్ అన్నాడు.
కోహ్లీ, ధోనీ గురించి అడిగితే.. మరో క్రికెటర్ పేరు చెప్పిన జావెలిస్ స్టార్ నవదీప్ సింగ్
ఇదిలా ఉంటే.. ధోని టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలిపాడు.