Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త హాకీ జ‌ట్టు హ‌వా కొన‌సాగుతోంది.

Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

Asian Champions Trophy india beat pakistan and enter semis

Updated On : September 14, 2024 / 3:32 PM IST

Asian Champions Trophy 2024 : ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త హాకీ జ‌ట్టు హ‌వా కొన‌సాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్ గా బ‌రిలోకి దిగిన భార‌త్ త‌న‌దైన శైలిలో వ‌రుస విజ‌యాల‌ను న‌మోదు చేస్తోంది. ఈ టోర్నీలో వరుస‌గా ఐదు మ్యాచులు గెలిచి అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టింది.

గ్రూపు ద‌శ‌లో ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ పై 2-1 తేడాతో విజ‌యం సాధించింది. అంత‌క‌ముందు చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1 తేడాతో భార‌త్ గెలుపొందింది.

MS Dhoni : ధోనికి కోపం వ‌స్తే.. జ‌రిగేది ఇదే.. సీఎస్‌కే మాజీ ఆట‌గాడి వ్యాఖ్య‌లు వైర‌ల్‌

ఇప్ప‌టికే సెమీస్‌ బెర్తు ఖరారు కావ‌డంతో పాకిస్థాన్‌తో మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. అయిన‌ప్ప‌టికి కూడా భార‌త్ ఎక్క‌డా నిర్ల‌క్ష్యంగా ఆడ‌లేదు. త‌న‌దైన శైలిలో దూకుడుగా ఆడుతూ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. కెప్టెన్ హార్మ‌న్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. పాకిస్థాన్ త‌రుపున న‌మోదైన ఏకైక గోల్‌ను అహ్మ‌ద్ న‌దీమ్ సాధించాడు.

ఇప్ప‌టికే భార‌త్‌, పాకిస్థాన్‌, ద‌క్షిణకొరియా జ‌ట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మలేసియా జ‌ట్టు నాలుగో స్థానంలో ఉంది. అయితే.. జ‌పాన్ వ‌ర్సెస్ చైనా మ్యాచ్‌లో విజేత ఆధారంగా నాలుగో స్థానం ఖ‌రారు కానుంది. జ‌పాన్‌కు ఎలాంటి అవ‌కాశాలు లేవు. చైనా మూడు పాయింట్ల‌తో ఉండ‌గా, మ‌లేసియా ఖాతాలో ఐదు పాయింట్లు ఉన్నాయి.

Sanju Samson : ఇలాగైతే ఎలా..? ఏం మాత్రం మార‌ని సంజూ శాంస‌న్‌!

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మొత్తం ఆరు జ‌ట్లు పోటీప‌డుతున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో టోర్నీ జ‌రుగుతోంది. ప్ర‌తి జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌తాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్‌లో టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌తాయి.