IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. అశ్విన్ భార్య ఆసక్తికర పోస్ట్..
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది.

Ashwin Wife Posts Special Message On Instagram Ahead Of Bangladesh Tests
IND vs BAN : సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్‌లు తొలి టెస్టు మ్యాచులో తలపడనున్నాయి. మొదటి టెస్టు మ్యాచ్‌కు ముందు అదే వేదికలో క్రికెటర్ల కోసం బీసీసీఐ సన్నాహక క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతీ నారాయణన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.
టీమ్ఇండియా జెర్సీలో ఉన్న అశ్విన్ ఫోటోను పోస్ట్ చేసింది. “చెన్నై.. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఫీలింగ్స్ వస్తున్నాయి.. కదూ? “అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న ‘సిక్సర్ల’ రికార్డు..
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో చెపాక్‌లో ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే సమయంలో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పంచుకుంది. టీమ్ఇండియా సొంతగడ్డపై ఆడేందుకు సిద్ధం అవుతోంది అంటూ ఆఫోటోల కింద రాసుకొచ్చింది. కౌంట్‌డౌన్ ప్రారంభమైంది అని తెలిపింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ లో చోటు దక్కించుకోవాలంటే ప్రతి టెస్టు మ్యాచ్ కీలకమే. ఈ నేపథ్యంలో బంగ్లాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది.
Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
🧵 Snapshots from #TeamIndia‘s training session in Chennai ahead of the 1st Test against Bangladesh.#INDvBAN pic.twitter.com/nqg94A73ju
— BCCI (@BCCI) September 13, 2024