IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌.. వ‌ర్షం వ‌స్తుందా..? ర‌ద్దైతే ప‌రిస్థితి ఏంటి..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 8లో భాగంగా నేడు (జూన్ 22 శ‌నివారం) భార‌త్‌, బంగ్లాదేశ్‌ జ‌ట్ల మ‌ధ్య ఆటింగ్వా వేదిక‌గా మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

India vs Bangladesh : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 8లో భాగంగా నేడు (జూన్ 22 శ‌నివారం) భార‌త్‌, బంగ్లాదేశ్‌ జ‌ట్ల మ‌ధ్య ఆంటిగ్వా వేదిక‌గా మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు ఎంతో కీల‌కం. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీఫైన‌ల్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. మ‌రోవైపు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్ర్క‌మించ‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో బంగ్లా ఆట‌గాళ్లు గెలిచేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.

కాగా.. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఉంది. ఇదే మైదానంలో జ‌రిగిన బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగించాడు. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో విజేతను నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో భార‌త్‌, బంగ్లాదేశ్‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగించి మ్యాచ్ ర‌ద్దు అయితే ప‌రిస్థ‌తి ఏంటని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఈ మ్యాచ్ ఉద‌యం 10.30 గంట‌ల‌కు మొద‌లు కానుంది. అదే భార‌త కాల‌మానం అయితే.. రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. అక్యూవెద‌ర్ ప్ర‌కారం.. స్థానిక కాల‌మానం ఉద‌యం 10 నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. అయితే.. మ్యాచ్ పూర్తిగా ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతోంది. అక్యూ నివేద‌క ప్ర‌కారం భార‌త్‌-బంగ్లా మ‌ధ్య టాస్ ఆల‌స్యం కావొచ్చు.

Nicholas Pooran : నికోల‌స్ పూర‌న్ సిక్స‌ర్ల సునామీ.. గేల్ పుష్క‌ర కాలం రికార్డు క‌నుమ‌రుగు..

ఒక‌వేళ మ్యాచ్ ర‌ద్దైతే.. ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయించ‌నున్నారు. అప్పుడు ఆఫ్గాన్ పై ఆసీస్ విజ‌యం సాధిస్తే భార‌త్, ఆస్ట్రేలియా లు సెమీఫైన‌ల్‌కు చేరుకుంటాయి.

ఆధిప‌త్యం ఎవ‌రిదంటే..?
టీ20 క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భారత్, బంగ్లాదేశ్ జట్లు 13 సార్లు తలపడ్డాయి. 12 మ్యాచుల్లో టీమ్ ఇండియా విజయం సాధించగా.. బంగ్లాదేశ్ ఓ మ్యాచ్‌లో గెలిచింది. దీంతో నేటి మ్యాచ్‌లో భార‌త్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగ‌నుంది.

తుది జ‌ట్ల అంచ‌నా..
టీమ్ఇండియా.. రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.

USA vs WI : అమెరికా ఇంటికి.. వెస్టిండీస్ ఆశ‌లు స‌జీవం..

బంగ్లాదేశ్.. తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీప‌ర్‌), న‌జ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తాంజ్, ముస్తాఫిజుర్ రెహమాన్.

ట్రెండింగ్ వార్తలు