Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 రన్స్ కే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 177 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు ఉన్నాయి. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (74), జడేజా (72) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
కరుణ్ నాయర్ (40), నితీశ్ (30) పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్, జోఫ్రా అర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కార్సే, షోయబ్ బషీర్ తలో వికెట్ తీశారు. ఆట మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 రన్స్ కు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. దిగ్గజ క్రికెటర్ రికార్డు బద్దలు