Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. దిగ్గజ క్రికెటర్ రికార్డు బద్దలు
ఓవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా అద్భుతమైన పోరాట పటిమ చూపాడు. ఈ క్రమంలో పంత్ చరిత్ర సృష్టించాడు.

Rishabh Pant: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెలరేగాడు. చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఓవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా అద్భుతమైన పోరాట పటిమ చూపాడు. ఈ క్రమంలో పంత్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 15 టెస్టులు ఆడిన పంత్.. 36 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉండేది. రిచర్డ్స్ తన 17 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో ఇంగ్లాండ్ పై 36 టెస్టులు ఆడి 34 సిక్సర్లు కొట్టాడు. తాజా మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన పంత్.. రిచర్డ్స్ రికార్డ్ ను ఆధగమించాడు. ఈ జాబితాలో టిమ్ సౌతీ మూడవ స్థానంలో, యశస్వి జైస్వాల్ నాల్గవ స్థానంలో, శుభ్‌మాన్ గిల్ ఐదవ స్థానంలో ఉన్నారు.
టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్లు..
రిషబ్ పంత్ – 36
వివ్ రిచర్డ్స్ – 34
టిమ్ సౌతీ – 30
యశస్వి జైస్వాల్ – 27
శుభమన్ గిల్ – 26
Also Read: ఐసీసీ జరిమానా నుంచి తెలివిగా తప్పించుకున్న శుభ్‌మన్ గిల్.. ఎలాగో తెలుసా..
ఈ మ్యాచ్ లో 112 బంతుల్లో 74 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. కేఎల్ రాహుల్ తో కలిసి నాలుగో వికెట్ కు 141 పరుగుల భాగస్వామ్యం చేశాడు. అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి పంత్ ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ డైరెక్ట్ త్రోతో పంత్ పెవిలియన్ చేరాడు. 66వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు పంత్. లంచ్ బ్రేక్ కి ముందే రాహుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించిన పంత్.. రిస్క్ చేశాడు. ఈ క్రమంలో రనౌట్ అయ్యాడు. పంత్ టెస్టుల్లో ఇప్పటివరకు 88 సిక్సర్లు బాదాడు. అలా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా వీరేందర్ సెహ్వాగ్ (91) ముందున్నాడు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ క్రికెటర్లు..
వీరేందర్ సెహ్వాగ్ 91
రిషబ్ పంత్ 88
రోహిత్ శర్మ 88
ఎంఎస్ ధోని 78
రవీంద్ర జడేజా 72