Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. 193 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా కష్టాల్లో పడింది. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కరుణ్ నాయర్ (14), గిల్ (6), ఆకాశ్ దీప్ (1) పెవిలియన్ చేరారు. కార్సే 2 వికెట్లు తీశాడు. ఆర్చర్, స్టోక్స్ తలో వికెట్ తీశారు. కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడు.
అంతకుముందు భారత బౌలర్లు చెలరేగారు. అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో నాలుగో రోజు ఆటలో ఊహించని విధంగా 62.1 ఓవర్లలో 192 పరుగులకే ఇంగ్లీష్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులు జో రూట్ హయ్యస్ట్ స్కోరర్. అతడు 40 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ 33 పరుగులు, హ్యారీ బ్రూక్ 23 పరుగులు, క్రాలీ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాడు. 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు. సిరాజ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. నితీశ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు.