KL Rahul: భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మూడో టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. ఒత్తిడిని జయించి అద్భుతమైన శతకం సాధించాడు. ఇంగ్లాండ్ కు భారత్ ధీటుగా బదులివ్వడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ క్రమంలో రాహుల్ మరో ఘనత సాధించాడు. దిగ్గజాల సరసన నిలిచాడు.
లండన్‌లోని చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో 176 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. అతడి టెస్ట్ కెరీర్‌లో 10వ శతకం. రాహుల్‌కు ముందు ఒకే ఒక్క ఇండియన్ క్రికెటర్ లార్డ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించాడు. అతడే దిలీప్ వెంగ్ సర్కార్.
ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో 13 ఫోర్లతో 176 బంతుల్లో రాహుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 2021 లోనూ ఇదే మైదానంలో రాహుల్ సెంచరీ కొట్టడం విశేషం. అప్పుడు 129 పరుగులు చేశాడు. ఇక భారత్ తరపున లార్డ్స్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ దిలీప్ వెంగ్ సర్కార్. అతను ఈ మైదానంలో మొత్తం 3 సెంచరీలు చేశాడు. భారత్ నుంచి మాత్రమే కాకుండా లార్డ్స్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆసియా బ్యాట్స్‌మెన్ గానూ రికార్డ్ సృష్టించాడు.
Also Read: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. దిగ్గజ క్రికెటర్ రికార్డు బద్దలు
లార్డ్స్‌లో రెండో సెంచరీతో దిగ్గజాల సరసన నిలిచాడు కేఎల్ రాహుల్. గతంలో బిల్ బ్రౌన్, గోర్డాన్ గ్రీనిడ్జ్, గ్రేమ్ స్మిత్ లు ఈ ఐకానిక్ వేదికపై ఒకటి కన్నా ఎక్కువ సెంచరీలు చేసిన విజిటింగ్ ఓపెనర్లుగా రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు వారి సరసన రాహుల్ కూడా నిలిచాడు.
మూడో రోజు ఆటలో లంచ్ తర్వాత 66 ఓవర్ నాలుగో బంతికి ఆర్చర్ బౌలింగ్ లో సింగిల్ తీసి రాహుల్ శతకాన్ని అందుకున్నాడు. ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు రాహుల్.