India vs England: వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్.. భారత జట్టుకు బిగ్‌షాకిచ్చిన ఇంగ్లాండ్

ఇండియా, ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.

Vaibhav Suryavanshi

India vs England Under-19 ODI Match: ఇండియా, ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో 14ఏళ్ల యువ ఆటగాడు.. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వన్డేలో 19 బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. వైభవ్ వరుసగా రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలను మిస్ చేసుకున్నాడు.

Also Read: బాబాయికి తోడుగా అబ్బాయి.. రంగంలోకి విరాట్ కోహ్లీ అన్న కొడుకు..

వైభవ్‌తోపాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మరో ఐపీఎల్ సంచలనం ఆయుశ్ మాత్రే ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా.. బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49 ఓవర్లలో 290 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (45), విహాన్ మల్హోత్రా (49), రాహుల్ కుమార్ (47), కనిష్క్ చౌహాన్ (45) రాణించారు. 291 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.


భారత్ అండర్ -19 జట్టు ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ ల కోసం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. హోవ్ మైదానంలో తొలి వన్డే జరగ్గా.. భారత్ జట్లు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. దీంతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లో 1-1తో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి.

మ్యాచ్ ల షెడ్యూల్ ..
♦ జూన్ 27, 1వ వన్డే – కౌంటీ గ్రౌండ్, హోవ్ – మధ్యాహ్నం 3:30
♦ జూన్ 30, 2వ వన్డే – కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ – మధ్యాహ్నం 3:30
♦ జూలై 2, 3వ వన్డే – కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ – మధ్యాహ్నం 3:30
♦ జూలై 5, 4వ వన్డే – కౌంటీ గ్రౌండ్, న్యూ రోడ్, వోర్సెస్టర్ – మధ్యాహ్నం 3:30
♦ జూలై 7, 5వ వన్డే – కౌంటీ గ్రౌండ్, న్యూ రోడ్, వోర్సెస్టర్ – మధ్యాహ్నం 3:30.