IND vs NZ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్ ప్రారంభం.. టాస్ గెలిచిన రోహిత్ సేన.. జట్టులో కీలక మార్పులు

న్యూజిలాండ్ తో తొలి టెస్టు మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసింది. శుభ్ మన్ గిల్ కు విశ్రాంతి ఇచ్చింది.

IND vs NZ 1st Test

IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ భారత్ వేదికగా కొనసాగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభంకావాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా ఒక్క బాల్ పడకుండానే తొలి రోజు మ్యాచ్ రద్దయింది. గురువారం (రెండోరోజు) వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో అంపైర్లు మ్యాచ్ ను ప్రారంభించారు. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే, రెండోరోజు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉంది. బెంగళూరు, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా మ్యాచ్ పూర్తిస్థాయిలో కొనసాగే విషయంపై అవనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: IND vs NZ : ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే తొలి రోజు ఆట ర‌ద్దు..

న్యూజిలాండ్ తో తొలి టెస్టు మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసింది. శుభ్ మన్ గిల్ కు విశ్రాంతి ఇచ్చింది. గిల్ 100శాతం ఫిట్ లేకపోవడంతో అతడికి విశ్రాంతిని ఇచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించారు. సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ లకు తుది జట్టులో చోటు దక్కింది. ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ కు అవకాశం దక్కింది.

 

భారత్ తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ తుది జట్టు..
టామ్ లాథమ్ (కెప్టెన్), డెహన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టీమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఓరూర్కీ.