India Vs New Zealand 2nd T20 : కివీస్‌తో రెండో టీ20.. భారత్ టార్గెట్ 154

సిరీస్‌ విజయంపై కన్నేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి

India Vs New Zealand 2nd T20 : సిరీస్‌ విజయంపై కన్నేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత్ ముందు 154 పరుగుల లక్ష్యం ఉంచింది. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న కివీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు.

Aadhaar-BHIM : గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు!

న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(34) టాప్ స్కోరర్. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్(31), డారిల్ మిచెల్(31), మార్క్ చాప్ మన్ 21 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. కాగా, భారత్‌ తరఫున టీ20ల్లోకి హర్షల్ పటేల్‌ అరంగేట్రం చేశాడు. మూడు టీ20ల సిరీస్ లో ఇప్పటికే ఒక విజయంతో భారత్ 1-0 తేడాతో లీడ్ లో ఉంది.

టీమిండియా పేసర్‌ హర్షల్‌ పటేల్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ద్వారా 94వ ఆటగాడిగా టీమిండియా తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్‌ పటేల్‌ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. హర్షల్‌ తాను వేసిన ప్రతీ బంతి దాదాపు 140 కిమీ వేగంతో విసరడం విశేషం. అలా తన డెబ్యూ మ్యాచ్‌తోనే హర్షల్‌ ప్రశంసలు అందుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు