Ind Vs Nz
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ఫార్మాట్ తో పెంచిన ఉత్కంఠను తొలి టెస్టు కొనసాగించింది. ఫలితం అటుంచి రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా మరింత పట్టుదలతో కనిపిస్తుంది. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ జట్టును నడిపించడంలో నిలకడగా కనిపిస్తున్నాడు.
యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (105), (65) అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు. బౌలర్లూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రెండో టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుతోపాటు చేరనున్నాడు. ఈ క్రమంలో జట్టు ఎంపికపై మేనేజ్‌మెంట్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రెండో టెస్టు కోసం జట్టును ప్రకటించలేదు బీసీసీఐ. విరాట్ కోహ్లీ రానుండటంతో జట్టులో మార్పులు ఎలా ఉంటాయా అని సందేహపడుతున్నారు అభిమానులు.
– సూర్యకుమార్‌కు అవకాశం కల్పించాలని భావిస్తే.. తొలి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో చోటు ఇవ్వొచ్చు. మయాంక్‌కే మరో అవకాశం ఇస్తే మాత్రం సూర్యకుమార్ డగౌట్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
…………………………………… : కాల్షియం కోసం పాలకు ప్రత్యామ్నాయంగా….
– విరాట్ వస్తే మిడిలార్డర్‌లో పుజారా, రహానె, శ్రేయస్ అయ్యర్‌లలో ఒకరిని తప్పించాల్సిందే.. అరంగేట్రంతోనే శ్రేయాస్ విజృంభించాడు. విఫలమైన పుజారా, రహానెలలో ఒకరిని పక్కన పెట్టాలా…? టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌లో సందిగ్ధత నెలకొంది. రెండో టెస్టుకు జట్టులో స్థానం దక్కినవారు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి.. లేదంటే డిసెంబర్ రెండో వారం నుంచి జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
– బౌలర్ల విషయానికొస్తే.. స్పిన్నర్లను కదిలించే పరిస్థితి లేదు. అశ్విన్ నేతృత్వంలోని స్పిన్ దళం పటిష్ఠంగా ఉంది. అశ్విన్‌తోపాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రయోగం చేద్దామని భావిస్తే మాత్రం జయంత్ యాదవ్‌కు అవకాశం లభించవచ్చు.
–తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీపర్ వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెన్నునొప్పితో ఫీల్డ్‌లోకి దిగకపోవడంతో శ్రీకర్ భరత్ కీపింగ్ చేశాడు. రెండో టెస్టు నాటికి సాహా అందుబాటులో లేకపోతే సుదీర్ఘఫార్మాట్‌లోకి భరత్ అరంగేట్రం అధికారికంగా ఖాయమే. ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ స్థానంలో కుర్రాళ్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణకు ఛాన్స్ దక్కనుంది.
………………………………………. : సౌండ్ బాక్సులు బద్ధలవుతున్నాయి.. ‘అఖండ’లో తమన్ వీర కొట్టుడు..
– పిచ్‌ను బట్టి ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో దిగాలనుకుంటే సిరాజ్‌కు చోటు కల్పించి.. అక్షర్, జడేజాలో ఒకరిని తప్పించే అవకాశం ఉంది.
న్యూజిలాండ్.. భారత్ ల మధ్య టెస్టు సిరీస్ లో ఆఖర్ మ్యాచ్ ను డిసెంబర్ 3 నుంచి 7వరకూ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్నారు.