×
Ad

Ind Vs NZ: ఇషాన్ కిషన్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్

  • Published On : January 31, 2026 / 08:41 PM IST

Ishan Kishan (Pic Courtesy @ EspnCricInfo)

Ind Vs NZ: తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ చెలరేగింది. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ సంచలన బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో మెరుపు వేగంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జస్ట్ 42 బంతుల్లోనే శతకం సాధించాడంటే ఏ రేంజ్ లో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టార్గెట్ 272 పరుగులు. ఇషాన్ కిషన్ 43 బంతుల్లో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లోనే 63 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్ధిక పాండ్యా ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 17 బాల్స్ లోనే 42 రన్స్ చేశాడు.