India vs New Zealand Semi-Final
IND vs NZ – World Cup 1st Semi-Final : క్రికెట్ అభిమానులకు మరో పండుగ రోజు వచ్చింది. వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా మరో గెలుపు కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాంఖడే స్టేడియం నేడు జరుగబోతున్న సెమీస్ లో కివీస్ తో భారత్ తలపడబోతుంది. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలైన టీమిండియాకు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దక్కింది.
వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న భారత్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. లీగ్ దశలో కివీస్ ను మట్టి కరిపించిన భారత్ సెమీస్ లోనూ అదే జోరు కనబరిచి ఫైనల్స్ లో అడుగు పెట్టాలన్న ఉత్సాహంతో ఉంది.
Kapil Dev : టీమ్ఇండియా ఆటగాళ్లపై కపిల్ దేవ్ కామెంట్స్.. సాయం కోసం రారు.. వారికి మా అవసరం లేదు
వరుసగా రెండో సారి వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడుతున్న టీమిండియా 2019లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఎనిమిదోసారి, న్యూజిలాండ్ తొమ్మిదోసారి సెమీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిది మ్యాచ్ లను గెలిచి వరుస విజయాలతో రికార్టులను నమోదు చేస్తోంది.
బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణిస్తున్న భారత్ కు స్వదేశంలో కివీస్ ను ఓడించడం పెద్ద కష్టమేవి కాదని క్రికెట్ అభిమానులు నమ్ముతున్నారు. టీమిండియా ఆడుతున్న తీరుతో సెమీప్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది క్రికెట్ ఫేవరేట్ జట్టుగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఆట స్థాయికి న్యూజిలాండ్ ఏ మాత్రం సరిపోక పోయినా ఇంతకముందు సంచనాలు సృష్టించిన చరిత్ర మాత్రం కివీస్ కు ఉంది.
IND vs NZ Semi Final : నేను మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నా..! సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో వైరల్
అంతేకాదు ద్వైపాక్షిక సిరీస్ లో లైనా, వరల్డ్ కప్ టోర్నీలోనైనా భారత్ పై న్యూజిలాండ్ కు మెరుగైన రికార్డే ఉంది. అయితే న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లలో మన ఆటగాళ్లు కాస్త తడబాటుకు గురవుతుంటారు. 2019 వరల్డ్ కప్ లోనూ ట్యాకిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత్ సెమీస్ లో తడపాటు కారణంగా కివీస్ చేతిలో ఓటమి పాలైంది. 2021లోనూ న్యూజిలాండ్ చేతిలోనే ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో టీమిండియా ఓడి పోయింది.
వన్డే వరల్డ్ కప్ లలో ఇప్పటిదాకా ఏడు సార్లు సెమీస్ కు చేరిన భారత్ నాలుగు సార్లు ఓడిపోయింది. 1987, 1996, 2015, 2019 సెమీ ఫైనల్స్ పరాజయం మూటగట్టుకుంది. అయితే ఈసారి మాత్రం భారత జట్టు అప్రతిహత విజయాలు సాధిస్తోంది. హేమాహేమీల్లాంటి జట్లను కూడా చిత్తు చేస్తూవుండటం, గతంలో ఎన్నడూ లేనంత సూపర్ ఫామ్ లో ఉండటం టీమిండియాకు బలంగా మారింది.
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, స్వదేశంలో మ్యాచ్ వంటి అనుకూలతల మధ్య భారత్ తేలికగా సెమీస్ నెగ్గే అవకాశాలున్నాయని క్రీడారంగం నిపుణులు చెబుతున్నారు. అనుకున్నట్లే టీమిండియా ఇదే జోష్ తో కివీస్ పై విజయం సాధిస్తే ఫైనల్స్ లో అడుగు పెట్టడం ఖాయమని క్రీడాభిమానులు అంటున్నారు.