India vs NZ Semi Final Match : ఇండియా వర్సెస్ కివీస్ మ్యాచ్ కు ట్విటర్ లో బెదిరింపు సందేశం.. పోలీసులు ఏం చేశారంటే?

ట్విటర్ లో వాంఖడే స్టేడియంకు బెదిరింపు సందేశం రావడంతో ముంబై పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో

Wankhede Stadium

ODi World Cup 2023 India vs NZ : భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం నేడు జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ లోకి వెళ్తుంది. ఈ మ్యాచ్లో విజయం ఏ జట్టును వరిస్తుందోనన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ మ్యాచ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి ట్విటర్ వేదికగా బెదిరింపు సందేశం పంపించాడు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో హింసాత్మక ఘటనకు ప్రణాళిక సిద్ధం చేశామని బెదిరింపు సందేశంలో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కు ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు. దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు.

Also Read : India vs NZ Semi Final Match : ఇండియా – కివీస్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆ గంటసేపు చాలా కీలకం.. ఏమైనా జరగొచ్చు..! ఎందుకంటే?

ట్విటర్ లో వాంఖడే స్టేడియంకు బెదిరింపు సందేశం రావడంతో ముంబై పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో తనికీ చేపట్టారు. ట్విటర్లో బెదిరింపు సందేశం పంపించిన అజ్ఞాత వ్యక్తి ఆ ట్వీట్ కు ముంబై పోలీసులను ట్యాగ్ చేయడంతోపాటు.. తుపాకీ, హ్యాండ్ గ్రెనేడ్ లు, బుల్లెట్ల ఫొటోలను చూపించాడు. అజ్ఞాతవ్యక్తి ఖాతా నుంచి వచ్చిన ట్వీట్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు సందేశం పంపించిన వ్యక్తి ఎవరనే విషయాపై ఆరా తీస్తున్నారు. బెదిరింపు సందేశం నేపథ్యంలో వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించే సమయంలో ప్రేక్షకులను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. భద్రత, ప్రోటోకాల్ తదితర అంశాలను మరింత కఠినతరం చేసేందుకు ముంబై పోలీసులు సమాయత్తమయ్యారు.

 

 

ఈరోజు వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో టాస్ కీలకం అవుతుంది. మొదటి బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా టాస్ ఓడి రెండో బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. మొదటి పది ఓవర్లు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రాధాన్యతనిస్తే ఆ తరువాత ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది. ఈ మెగాటోర్నీ లీగ్ దశలో భారత్ జట్టు వరుసగా తొమ్మిది విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇవాళ జరిగే సెమీస్ పోరులోనూ కివీస్ జట్టుపై భారత్ విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.