India vs South Africa
India vs South Africa : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.
మొదటి టెస్టులో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సాయి సుదర్శన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. అయితే, ఇటీవల కాలంలో బౌలింగ్ లోనేకాకుండా బ్యాటింగ్‌లోనూ వాషిగ్టన్ సుందర్ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడా లేదంటే ధ్రువ్ జురెల్ ఆ స్థానాన్ని తీసుకుంటాడా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు ఇటీవల గాయంతో టీమిండియాకు దూరమైన స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. నితీష్ రెడ్డి స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ కూడా తిరిగి టీంలోకి వచ్చాడు.
ఈ మ్యాచ్‌కు సఫారీ స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ దూరమయ్యాడు. అతడి స్ధానంలో బాష్ తుది జట్టులోకి వచ్చాడు.
భారత్ తుది జట్టు : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా తుది జట్టు : ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్.
INDIA’S PLAYING XI:
KL, Jaiswal, Sundar, Gill (C), Pant (WK), Jadeja, Jurel, Axar, Kuldeep, Bumrah and Siraj. pic.twitter.com/QrdiB0rN2q
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2025