IndVsSA 5th T20 : బెంగళూరులో భారీ వర్షం.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు అంతరాయం

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5వ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ ప్రారంభానికి అంతరాయం కలిగింది.

IndVsSA 5th T20 : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5వ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా మైదానంలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. పిచ్ పై కవర్లను కప్పి ఉంచారు. కాసేపటికి వర్షం నిలిచిపోవడంతో మైదానాన్ని ఆటకు అనువుగా చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ 7.50 గంటలకు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఒక్కో జట్టు 19 ఓవర్లు ఆడుతుందని వెల్లడించారు. కాగా, ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఇరుజట్లు 2-2తో సమంగా ఉన్నాయి. దాంతో బెంగళూరు మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో ఎవరు గెలిస్తే కప్ వారిదే.

Mayank Agarwal : రాహుల్ స్థానంలో మయాంక్‌‌.. వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌..!

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి డీలాపడిన టీమిండియా.. తర్వాత అనుహ్యంగా పుంజుకుంది. మూడు, నాలుగు టీ20ల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇప్పుడు కీలకపోరుకు సిద్ధమైంది. సిరీస్‌ నిర్ణయాత్మక పోరులో ఇరుజట్లు తలపడుతునున్నాయి. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ మరోసారి టాస్‌ ఓడాడు. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో గాయపడిన తెంబా బవుమా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో కేశవ్‌ మహరాజ్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

Dinesh Karthik : వరల్డ్ కప్ ఆడటమే ధ్యేయం.. నా జీవితంలో ఇదే ముఖ్యం..!

ట్రెండింగ్ వార్తలు