Dinesh Karthik : వరల్డ్ కప్ ఆడటమే ధ్యేయం.. నా జీవితంలో ఇదే ముఖ్యం..!

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రపంచకప్ జట్టులో తాను ఆడేందుకు నిర్ణయించుకున్నానని భారత ఆటగాడు దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

Dinesh Karthik : వరల్డ్ కప్ ఆడటమే ధ్యేయం.. నా జీవితంలో ఇదే ముఖ్యం..!

Dinesh Karthik Reveals He Is Determined To Play The Upcoming T20 World Cup Very Important In My Life

Dinesh Karthik : ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రపంచకప్ జట్టులో తాను ఆడేందుకు నిర్ణయించుకున్నానని భారత ఆటగాడు దినేష్ కార్తీక్ వెల్లడించాడు. ఈ ఏడాది 2022 IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున ఆడిన కార్తీక్ తనదైన ఆటతీరుతో అందరిని అబ్బుపరిచాడు. తన వయస్సు ఆటగాళ్లంతా రిటైర్ అయిపోతుంటే.. తాను మాత్రం ఇంక స్టామినా అలానే ఉందంటూ దినేశ్ కార్తీక్ చెలరేగిపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో కార్తీక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. తమిళనాడు ఆటగాడు తన ఫ్రాంచైజీకి 55 సగటుతో 330 పరుగులు అందించాడు. జట్టులో మంచి ఫినిషర్‌గా 183.33 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో తన చక్కటి ఫామ్‌ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

37 ఏళ్ల దినేశ్ కార్తీక్.. 27 బంతుల్లో 55 పరుగులు చేయడంతో భారత్ రాజ్‌కోట్‌లో ప్రోటీస్‌పై విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. BCCI వెబ్‌సైట్‌లో హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తమిళనాడు బ్యాటర్ కార్తీక్ వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా T20 ప్రపంచ కప్ జట్టులో తాను భాగం కావడం చాలా ముఖ్యమని, తాను జట్టు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాడని చెప్పాడు. భారత్‌కు కఠినమైన మ్యాచ్‌లను గెలిపించే కుర్రాడిగా నిలవాలనుకుంటున్నానని కార్తీక్ చెప్పాడు. నేను ఈసారి ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నాను. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైనది. నేను చాలా కాలం పాటు వేచి ఉన్నాను. జట్టులో చోటు దక్కడం ఎంత ఎంత విలువైనదో నాకు తెలుసునని చెప్పుకొచ్చాడు.

టీమ్ ఇండియా కోసం తాను ఆడేందుకు సిద్దంగా ఉన్నానని దినేశ్ కార్తీక్ తెలిపాడు. అదృష్టవశాత్తూ, RCB నాకు ఆ ప్లాట్‌ఫారమ్‌ను ఇచ్చింది. బ్యాకెండ్‌లో నా పాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాను. అందుకోసం నిరంతరం నేను శ్రమించాను. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. కఠినమైన గేమ్‌లను గెలవడానికి జట్టుకు సాయపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ జట్టులో భాగం కావడం ఎంత కష్టమో నాకు తెలుసు. వైబ్ చాలా భిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పకొచ్చాడు.

Read Also : IPL : ఐపీఎల్‌ ఆట మాత్రమే కాదు కాసులు కురిపించే అక్షయపాత్ర..ఆక్షన్ ఏదైనా డబ్బులే డబ్బులు…