IPL : ఐపీఎల్‌ ఆట మాత్రమే కాదు కాసులు కురిపించే అక్షయపాత్ర..ఆక్షన్ ఏదైనా డబ్బులే డబ్బులు…

ఐపీఎల్‌ ఆట మాత్రమే కాదు ఆదాయం కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది మరి ! టాటా ఇలా స్పాన్సర్‌షిప్‌ తీసుకుందో లేదో.. షేర్లు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయ్. అందుకే ఐపీఎల్‌లో భాగం అయ్యేందుకు.. ఐపీఎల్‌తో భాగం అయ్యేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతుంటాయ్. ఆ పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో.. మీడియా ప్రసార హక్కుల వేలంతో మళ్లీ ప్రూవ్ అయింది. 410 మ్యాచ్‌లకు 44వేల కోట్లకు టీవీ, డీజిటల్‌ ప్రసార హక్కులు అమ్ముడయ్యాయ్.

IPL : ఐపీఎల్‌ ఆట మాత్రమే కాదు కాసులు కురిపించే అక్షయపాత్ర..ఆక్షన్ ఏదైనా డబ్బులే డబ్బులు…

Ipl Cricket Matches (2)

IPL : ఐపీఎల్‌ ఆట మాత్రమే కాదు ఆదాయం కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది మరి ! టాటా ఇలా స్పాన్సర్‌షిప్‌ తీసుకుందో లేదో.. షేర్లు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయ్. అందుకే ఐపీఎల్‌లో భాగం అయ్యేందుకు.. ఐపీఎల్‌తో భాగం అయ్యేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతుంటాయ్. ఆ పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో.. మీడియా ప్రసార హక్కుల వేలంతో మళ్లీ ప్రూవ్ అయింది. 410 మ్యాచ్‌లకు 44వేల కోట్లకు టీవీ, డీజిటల్‌ ప్రసార హక్కులు అమ్ముడయ్యాయ్.

ఐపీఎల్ అనేది ఆట కాదు.. ఓ ఎమోషన్.. ఆటలో గెలిచేది ఎవరు.. ఓడేది ఎవరు అని కాదు.. ఎవ్రీ ఇయర్‌ మెమొరీస్‌ను మిగిల్చి వెళ్లిపోతుంది. అందుకే ఐపీఎల్‌ మ్యాచ్‌లను వేడుకలా చేసుకునే కుర్రాళ్లు ఎందరో ! సమ్మర్‌ అంటే సూర్యుడే కాదు.. ఐపీఎల్‌ కూడా అని ఫీలవుతుంటారు క్రికెట్ ఫ్యాన్స్ ! ఈ ఎమోషన్ ఏ స్థాయికి వెళ్లిందంటే.. అసలీ కాన్సెప్ట్ వర్కౌట్‌ అవుతుందా అన్న అనుమానం నుంచి.. ఇలాంటి కాన్సెప్ట్‌ కనిపెట్టిన వాళ్లకు సలాం అనే రేంజ్‌కు చేరింది. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. ప్రతీ బంతీ బంగారు గుడ్డుగా మారుతోంది.

స్పాన్సర్‌షిప్‌, బ్రాండ్‌ వ్యాల్యూ, వేలంపాట, ప్రసార హక్కులు.. ఇలా ప్రతీదాంట్లో ఐపీఎల్‌కు కోట్లు వచ్చి చేరుతున్నాయ్. క్రికెట్‌ను ఐపీఎల్‌ ఏ రేంజ్‌లో కూర్చోబెట్టిందంటే.. క్రికెట్ అంటే..పిచ్చివాళ్లు ఆడే అంటూ గేలి చేసి ఎగ‌తాళి చేసిన అమెరికా కూడా ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ వైపు మొగ్గుచూపుతోంది. గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్‌ జట్ల కోసం.. ఫ్రాంచైజీలు కుమ్మరించిన కాసుల చప్పుడు ఇప్పటికీ వినిపిస్తున్న వేళ.. ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి రాబోతోన్న అమౌంట్ చూసి ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ బిడ్ దాఖలు చేయగా.. డిస్నీ స్టార్‌, వయాకామ్‌ 18 భారీ డబ్బులు వెచ్చించి సొంతం చేసుకున్నాయ్.

2023-2027 వరకు.. రాబోయే ఐదేళ్లలో 410 ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారం కోసం.. 44వేల కోట్లను డిస్నీ స్టార్‌, వయాకామ్18 ఖర్చు చేయబోతున్నాయ్. ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులు 44వేల 75 కోట్లకు అమ్ముడయ్యాయ్. ప్యాకేజీ A.. అంటే భారతదేశంలో టీవీ హక్కులను 23వేల 575 కోట్లకు విక్రయించారు. ఈ ప్యాకేజిలో మొత్తం 410 మ్యాచ్‌లు ఉంటాయ్. అంటే టీవీ హక్కుల బిడ్‌ విజేత ఒక్కో మ్యాచ్‌కు 57కోట్ల 50 లక్షలు చెల్లిస్తుందన్నమాట. ఐతే అందరినీ అట్రాక్ట్‌ చేసింది.. అవాక్కయ్యే ఫీలింగ్ మిగిల్చింది మాత్రం… డిజిటల్‌ హక్కులకు పలికిన ధరే ! ప్యాకేజీ B విభాగం.. అంటే డిజిటల్ రైట్స్‌కు సంబంధించి మ్యాచ్‌కు 50కోట్ల చొప్పున 20వేల 500 కోట్లకు అమ్ముడయ్యాయ్. ఇలా టీవీ, డిజిటల్‌కు కలిపి ఒక్కో మ్యాచ్‌కు రూ. 107.5 కోట్లు ఖర్చు చేయనున్నాయ్. మొత్తంగా 44వేల 75 కోట్లు ప్రసార హక్కుల కోసం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయ్.

2018-22 ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కులను ఇదే స్టార్‌ ఇండియా సొంత చేసుకుంది. అప్పటితో కంపేర్‌ చేస్తే.. ఇప్పుడు కేవలం టీవీ రైట్స్‌కే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధం అయింది. 2018-22 మధ్య ఐపీఎల్‌ ప్రసార హక్కుల కోసం స్టార్ ఇండియా కేవలం 16వేల 347 కోట్లు మాత్రమే చెల్లించింది. 2008లో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌.. ప్రారంభం అయినప్పుడు రకరకాల అభిప్రాయాలు వినిపించాయ్. విమర్శలు చేసిన వారు కూడా లేకపోలేదు. 15 ఏళ్లు తిరిగేసరికి.. ప్రపంచం కూడా అందుకోలేని స్థాయికి ఐపీఎల్ చేరుకుంది. అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలాంటి దేశాలు కూడా ఒక్కసారి.. ఐపీఎల్‌ వైపు తిరిగి చూసేలా చేస్తున్నాయ్. అన్ని రకాల మీడియా ప్రసార హక్కులు కలిపి 46వేల కోట్లు దాటడం చాలు.. ఐపీఎల్‌ ఏ రేంజ్ సక్సెస్ అయిందో చెప్పడానికి !

2008లో ఐపీఎల్‌ ప్రారంభం అయినప్పుడు పదేళ్ల కాలానికి 8వేల 200 కోట్లకు చెల్లించి సోనీ పిక్చర్స్ ప్రసార హక్కులను దక్కించుకుంది. 2015లో ఐపీఎల్ గ్లోబల్ డిజిటల్ రైట్స్‌ను మూడేళ్ల కాలానికి గానూ 302.2 కోట్లకు నోవి డిజిటల్ సొంతం చేసుకుంది. 2017 సెప్టెంబర్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో సోనీ పిక్చర్స్‌ను వెనక్కి నెట్టి… స్టార్ ఇండియా ఐపీఎల్ ప్రసార హక్కులను ఏకంగా 16వేల 347 కోట్లకు దక్కించుకుంది. ఇదే సంస్థ ఇప్పుడు కేవలం టీవీ రైట్స్‌కు మాత్రమే 23వేల 575 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం అయింది. మీడియా ప్రసార హక్కుల ద్వారా మొత్తం 50వేల కోట్లు వస్తాయన్న బీసీసీఐ అంచనాలే దాదాపు నిజం అయ్యాయ్. ఇప్పటికే గల్లాపెట్టె గలగలతో.. రిచ్‌గా కనిపిస్తున్న బీసీసీఐ ఖజానా.. ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌ అవుతోంది.

2023 ఐపీఎల్‌ సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరుగుతాయ్‌. 2025లో ఆ నంబర్‌ 84కు పెరుగుతుంది. 2027లో 94 మ్యాచ్‌లు జరుగుతాయ్‌. ప్రతీ మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠతో సాగుతుండడం.. ఐపీఎల్ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా యాడ్స్ ఇవ్వడానికి పరిగెత్తుకు వస్తాయి. అవే బ్రాడ్‌కాస్టర్లకు ఫుల్ భరోసా ఇస్తున్నాయి. ఎంతకైనా తగ్గేదేలే అంటూ ప్రసార హక్కుల కోసం బిడ్స్ వేసేలా చేశాయి.