IND vs SA: రోహిత్ శర్మను చూసి ఆ విషయాన్ని నేర్చుకున్నా : సూర్యకుమార్ యాదవ్

రుతురాజ్ గైక్వాడ్ కు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో చోటు దక్కకపోవడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..

Suryakumar Yadav

Suryakumar Yadav: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య నాలుగు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇవాళ (శుక్రవారం) ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిష్క్రమణ అనంతరం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టును టీమిండియా ఎదుర్కోనుంది. తొలి టీ20 మ్యాచ్ డర్బన్ లో రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక్కడి పిచ్ పేసర్లకు బాగా సహకరిస్తుంది. ఇక్కడ బంతి బాగా బౌన్స్ అవుతుంది. సఫారీ పేసర్లను ఎదుర్కొని షాట్లు ఆడడం, పరుగులు సాధించడం అంతతేలిక కాదు. మరి దూకుడుగా ఆడడం అలవాటైన యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

Also Read: IND vs SA : న‌వంబ‌ర్ 8 నుంచి ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?

ఇదిలాఉంటే.. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆటలో గెలుపోటములు సహజం. ప్రతిఒక్కరూ కష్టపడేవారే. కొన్నిసార్లు దానికి ఫలితం ఉంటుంది. కొన్నిసార్లు ఉండదు. జీవితంలో సమతూకం అన్నది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని నేను రోహిత్ శర్మను చూసి నేర్చుకున్నానని సూర్యకుమార్ అన్నారు. నేను గ్రౌండ్ లో ఉన్నప్పుడు రోహిత్ ను గమనిస్తూనే ఉంటాను. అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. అతను ఎలా ప్రశాంతంగా ఉంటాడు.. అతను తన బౌలర్లతో ఎలా ప్రవర్తిస్తాడు.. ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు. గెలిచినప్పుడు లేదా ఓడినప్పుడు మన వ్యక్తిత్వం మారిపోకూడదు. క్రీడాకారుడు ఎప్పుడూ ఒకేలా ఉండాలని రోహిత్ శర్మను చూసి తెలుసుకున్నానని సూర్య అన్నారు.

Also Read: SA vs IND : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. ప‌లు రికార్డుల‌పై క‌న్నేసిన అర్ష్‌దీప్ సింగ్‌..

రుతురాజ్ గైక్వాడ్ కు టీ20 సిరీస్ లో చోటు దక్కకపోవడంపై సూర్యకుమార్ మాట్లాడుతూ.. రుతురాజ్ అద్భుతమైన ఆటగాడు. అతను ఆడే అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన, స్థిరమైన ఆటగాడు. అతని కంటే ముందు కూడా చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబర్చారు. రోటీన్ ప్రక్రియలో భాగంగా రుతురాజ్ సమయం త్వరలో వస్తుందని నేను నమ్ముతున్నాను అని సూర్య పేర్కొన్నారు.