SA vs IND : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. పలు రికార్డులపై కన్నేసిన అర్ష్‌దీప్ సింగ్..
టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పలు రికార్డులపై కన్నేశాడు.

Arshdeep Singh eyes all time India record in T20Is
SA vs IND : టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పలు రికార్డులపై కన్నేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా రికార్డులకు ఎక్కన్నాడు. నవంబర్ 8 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. 2022లో భువీ 32 టీ20 మ్యాచుల్లో 6.96 ఎకానమీతో 37 వికెట్లు పడగొట్టాడు.
ఈ ఏడాది ఇప్పటి వరకు అర్ష్‌దీప్ సింగ్ 14 మ్యాచులు ఆడాడు. 7.14 ఎకానమీతో 28 వికెట్లు సాధించాడు. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అమెరికాతో జరిగిన మ్యాచులో అర్ష్‌దీప్ కేవలం 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాప్రికా పర్యటనలో మరో 8 వికెట్లు తీస్తే అర్ష్‌దీప్ ఈ ఘనత అందుకుంటాడు.
IND vs AUS : భారత్‌తో టెస్టు సిరీస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా.. కొత్త కెప్టెన్..
100 వికెట్లకు 13 దూరంలో..
టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. 80 టీ20 మ్యాచుల్లో 96 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ ప్రస్తుతం 56 మ్యాచుల్లో 87 తీశాడు. మరో 10 వికెట్లు పడగొడితే టీమ్ఇండియా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. 13 వికెట్లు తీస్తే.. టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – నవంబర్ 8 – డర్బన్
రెండో టీ20 – నవంబర్ 10 – సెయింట్ జార్జ్ పార్క్
మూడో టీ20 – నవంబర్ 13 – సెంచూరియన్
నాలుగో టీ20 – నవంబర్ 15 – జోహెన్నెస్ బర్గ్
ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ పై కీలక అప్‌డేట్.. మరో వారంలో..!