IND vs AUS : భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆస్ట్రేలియా.. కొత్త కెప్టెన్..

నవంబ‌ర్ 22 నుంచి భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

IND vs AUS : భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆస్ట్రేలియా.. కొత్త కెప్టెన్..

Josh Inglis to lead Australia in T20I series against Pakistan

Updated On : November 6, 2024 / 1:24 PM IST

IND vs AUS : నవంబ‌ర్ 22 నుంచి భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే ఇరు జ‌ట్ల‌కు ఈ 5 టెస్టు మ్యాచుల సిరీస్ ఎంతో కీల‌కం. నాలుగు మ్యాచుల్లో భార‌త్ విజ‌యం సాధిస్తే మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. మ‌రోవైపు ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

గ‌త రెండు ప‌ర్య‌ట‌న‌ల్లో భార‌త జ‌ట్టు బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ విజేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఈ సారి ఎలాగైనా గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని ఆస్ట్రేలియా గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందుక‌నే ఈ సిరీస్‌లో ఆడే ఆట‌గాళ్లను పాక్‌తో జ‌రుగుతున్న వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు ప‌క్క‌న‌బెట్టి ప్ర‌త్యేక సాధ‌న చేయించాల‌ని నిర్ణ‌యించుకుంది.

ICC Champions Trophy 2025 : ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ పై కీల‌క అప్‌డేట్‌.. మ‌రో వారంలో..!

ఈ నేప‌థ్యంలో పాక్‌తో జ‌రుగుతున్న సిరీస్‌ల‌కు కొత్త కెప్టెన్‌ను ప్ర‌క‌టించింది. మూడో వ‌న్డేతో పాటు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు వికెట్ కీప‌ర్ జోష్ ఇంగ్లిస్‌ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా జ‌ట్టుకు 14వ టీ20 కెప్టెన్‌గా, 30వ వ‌న్డే నాయ‌కుడిగా 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ఇంగ్లిస్ రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, మార్నస్ ల‌బుషేన్‌, స్టీవ్ స్మిత్‌లను మూడో వ‌న్డే నుంచి ఆసీస్ బోర్డు త‌ప్పించింది. టెస్టు సిరీస్‌లో పాల్గొనే ఆట‌గాళ్లు ఎవ్వ‌రిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయ‌లేదు.

IPL Mega Auction : ఐపీఎల్ మెగా వేలం.. రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో పేర్ల‌ను న‌మోదు చేసుకున్న స్టార్ ఆట‌గాళ్లు వీరే..

వాస్త‌వానికి పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు గ‌త‌వార‌మే ఆస్ట్రేలియా జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే.. కెప్టెన్ ఎవ‌రు అనే విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. దీంతో సీనియ‌ర్ ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు ల‌భిస్తాయ‌ని అంతా భావించారు. తాజాగా అత‌డికి షాక్ ఇస్తూ ఇంగ్లిస్‌ను కెప్టెన్‌గా నియ‌మించింది.

పాకిస్థాన్‌లో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.