IPL Mega Auction : ఐపీఎల్ మెగా వేలం.. రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో పేర్లను నమోదు చేసుకున్న స్టార్ ఆటగాళ్లు వీరే..
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

IPL 2025 Mega Auction Who Are The Players At Highest Base Price Of 2 Crore
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో వేలాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొత్తం 1574 మంది పేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో భారత క్రికెటర్లు 1165 మంది కాగా.. 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్ వంటి ప్లేయర్లు వేలంలో ఉన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అరంగ్రేటం చేయని ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ తాజాగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ 42 ఏళ్ల పేసర్ ను ఎవరైనా తీసుకుంటారో లేదో చూడాల్సిందే. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ తన పేరును నమోదు చేసుకోలేదు.
రూ.2కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలో పేర్లు నమోదు చేసుకున్న స్టార్ ఆటగాళ్లు వీరే..
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, చాహల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టీ నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ లాంటి వాళ్లు ఉన్నారు.
విదేశీ ఆటగాళ్ల జాబితాలో జోఫ్రా ఆర్చర్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, జానీ బెయిర్ స్టో, గుస్ అట్కిన్సన్, జోస్ బట్లర్, కగిసో రబాడ, గ్లెన్ మాక్స్‌వెల్, మార్క్ వుడ్ వంటి ఆటగాళ్లు రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో అడుగుపెట్టనున్నారు. ఇక గతంలో మినీ వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షాలు రూ.75 లక్షలతో వేలం బరిలో నిలవనున్నారు.
ఇక రిటెన్షన్ అనంతరం ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత నగదు ఉందంటే..?
* పంజాబ్ కింగ్స్ – రూ.110.5 కోట్లు
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.83 కోట్లు
* ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.73 కోట్లు
* లక్నో సూపర్ జెయింట్స్ – రూ.69 కోట్లు
* గుజరాత్ టైటాన్స్ -రూ.69 కోట్లు
* చెన్నై సూపర్ కింగ్స్ – రూ.55 కోట్లు
* కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ.51 కోట్లు
* ముంబై ఇండియన్స్ – రూ.45 కోట్లు
* ఎస్‌ఆర్‌హెచ్ – రూ.45 కోట్లు
* రాజస్థాన్ రాయల్స్- రూ. 41 కోట్లు