Virat Kohli : బర్త్ డే నాడు కొడుకు, కూతురుతో విరాట్ కోహ్లీ.. పిక్ వైరల్.. షేర్ చేసింది ఎవరో తెలుసా?
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు(నవంబర్ 5).

Anushka Sharma Drops Unmissable Post On Kohli Birthday
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు(నవంబర్ 5). న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగియడంతో కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఇక కోహ్లీ 36వ పుట్టిన రోజు సందర్భంగా అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కూతురు వామిక, కుమారుడు అకాయ్ లను విరాట్ కోహ్లీ ఎత్తుకున్న ఫోటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
అయితే.. ఈ ఫోటోలో పిల్లలు ఇద్దరి ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడింది. అయినప్పటికి ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన కోహ్లీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Virat Kohli : వాహ్.. సాగర తీరంలో విరాట్ కోహ్లీ సైకత శిల్పం చూశారా.. వీడియో వైరల్
16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు (50) చేసిన ప్లేయర్‌గా విరాట్ కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ (2011), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2013), టీ20 ప్రపంచకప్‌ను (2024) నెగ్గిన జట్లలో విరాట్ సభ్యుడు.
ఇప్పటి వరకు కోహ్లీ టీమ్ఇండియా తరుపున 118 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 47.8 సగటుతో 9040 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 58.2 సగటుతో 13906 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 72 అర్థశతకాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 48.7 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 38 అర్థశతకాలు ఉన్నాయి.
IND vs SA : నవంబర్ 8 నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
ఇక ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి అంటే 2008 నుంచి ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున కోహ్లీ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 252 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 6065 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు 55 అర్ధశతకాలు ఉన్నాయి.
View this post on Instagram