Virat Kohli : వాహ్.. సాగర తీరంలో విరాట్ కోహ్లీ సైకత శిల్పం చూశారా.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టినరోజు ఇవాళ. 36వ ఏడాదిలోకి కింగ్ కోహ్లీ అడుగుపెట్టాడు.

Virat Kohli
Virat Kohli Birthday: టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టినరోజు ఇవాళ. 36వ ఏడాదిలోకి కింగ్ కోహ్లీ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా టీమిండియా అభిమానులు, కోహ్లీ అభిమానులు బర్త్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కోహ్లీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన ఆర్ట్ తో కోహ్లీపై అభిమానాన్ని చాటుకోవడంతోపాటు.. కోహ్లీ ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.
Also Read: IND vs SA : నవంబర్ 8 నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
ఒడిశాలోని పూరీ బీచ్ లో ఐదు అడుగుల సైతక శిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ రూపొందించాడు. దీనిని దాదాపు నాలుగు టన్నుల ఇసుకతో తయారు చేశాడు. తన సాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో కలిసి ఈ ఆర్డ్ ను రూపొందించాడు. ఈ సైతక శిల్పంలో విరాట్ కోహ్లీ చిత్రంతోపాటు.. భారీ పరిమాణం కలిగిన బ్యాట్ పై ‘హ్యాపీ బర్త్ డే విరాట్’ అని రాసి ఉంది. ఈ సైతక శిల్పం చిత్రాన్ని, వీడియోను సుదర్శన్ పట్నాయక్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ చిత్రాన్ని చూసి కోహ్లీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పట్నాయక్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Happy birthday to the incredible cricket icon @imVkohli , a legend in every format of the game, My SandArt at Puri beach in Odisha. #HappyBirthdayViratKohli pic.twitter.com/C3dlnsGNt0
— Sudarsan Pattnaik (@sudarsansand) November 5, 2024