IPL auction : ఐపీఎల్ మెగా వేలం.. పేర్లు నమోదు చేసుకున్న 1574 మంది క్రికెటర్లు.. అదృష్టం 204 మందికే..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన తేదీలు వచ్చేశాయి.

IPL auction 1574 players register
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన తేదీలు వచ్చేశాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో వేలాన్ని నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. మొత్తం 1574 మంది ప్లేయర్లు వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 1165 మంది భారత క్రికెటర్లు కాగా, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది క్రికెటర్లు పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తరువాత ఆస్ట్రేలియా నుంచి 76 మంది, అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు ఉన్నారు. మెగా వేలం కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 320 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు కాగా.. 1224 మంది అరంగ్రేటం చేయని వాళ్లు ఉన్నారు.
204 మందికి ఛాన్స్..
అన్ని ఫ్రాంచైజీలు కలిపి మెగా వేలంలో మొత్తం 204 మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. పది ఫ్రాంచైజీలు కలిపి 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఒక్కొ ఫ్రాంఛైజీ గరిష్టంగా 25 మందిని ఆటగాళ్లతో జట్టును తయారుచేసుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు మెగా వేలంలో ఉండడంతో వారిని ఎవరు సొంతం చేసుకుంటారా? అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి ఫ్రాంచైజీకి రూ.120 కోట్లు కేటాయించారు. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం అత్యధికంగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ.110.50 కోట్లు ఉండగా.. అతి తక్కువగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి.
IND vs SA : నవంబర్ 8 నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
ఫ్రాంచైజీల వద్ద మిగిలిన పర్స్ వాల్యూ, ఆర్‌టీఎమ్ కార్డ్స్, కావాల్సిన ఆటగాళ్ల సంఖ్య..
* పంజాబ్ కింగ్స్ – రూ.110.5 కోట్లు (ఆర్‌టీఎమ్-04) – 23 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -08)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.83 కోట్లు (ఆర్‌టీఎమ్-03) – 22 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -08)
* ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.73 కోట్లు (ఆర్‌టీఎమ్-02) – 21 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
* లక్నో సూపర్ జెయింట్స్ – రూ.69 కోట్లు (ఆర్‌టీఎమ్-01) – 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
* గుజరాత్ టైటాన్స్ -రూ.69 కోట్లు (ఆర్‌టీఎమ్-01) – 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)
* చెన్నై సూపర్ కింగ్స్ – రూ.55 కోట్లు (ఆర్‌టీఎమ్- 01) – 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు-07)
* కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ.51 కోట్లు (ఆర్‌టీఎమ్-0) – 19 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -06)
* ముంబై ఇండియన్స్ – రూ.45 కోట్లు (ఆర్‌టీఎమ్- 01) – 21 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు-08)
* ఎస్‌ఆర్‌హెచ్ – రూ.45 కోట్లు (ఆర్‌టీఎమ్-0) – 20 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -05)
* రాజస్థాన్ రాయల్స్- రూ. 41 కోట్లు (ఆర్‌టీఎమ్-0) – 19 స్లాట్స్ (విదేశీ ప్లేయర్లు -07)