ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ పై కీలక అప్‌డేట్.. మరో వారంలో..!
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

ICC Champions Trophy 2025 Schedule likely to be announced next week
ICC Champions Trophy : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో వారం రోజుల్లో వెల్లడించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ ప్రతినిధి బృందం టోర్నీ ఏర్పాట్లను పరిశీలించేందుకు నవంబర్ 10 నుంచి 12 వరకు లాహోర్‌లో పర్యటించనుంది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడం పై ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది. గతేడాది ఆసియా కప్‌ను నిర్వహించినట్లుగానే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీ కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.
హైబ్రిడ్ మోడ్ అంటే.. భారత్ ఆడే మ్యాచులను పాకిస్థాన్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించనున్నారు. ఆసియా కప్ సందర్భంగా భారత మ్యాచులను శ్రీలంకలో నిర్వహించారు.
మొత్తం 8 దేశాలు పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలు పాల్గొననున్నాయి. భారత్ మినహా ఇప్పటికే అన్ని దేశాలు పాక్‌లో ఆడేందుకు అంగీకరించాయి. ఈ టోర్నీకి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే ఐసీసీకి అందజేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 డ్రాప్ట్ షెడ్యూల్..
ఫిబ్రవరి 19 – న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ – కరాచీ
ఫిబ్రవరి 20 – బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ – లాహోర్
ఫిబ్రవరి 21 – అఫ్గానిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా – కరాచీ
ఫిబ్రవరి 22 – ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ – లాహోర్
ఫిబ్రవరి 23 – న్యూజిలాండ్ వర్సెస్ భారత్ – లాహోర్
ఫిబ్రవరి 24 – పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ – రావల్పిండి
ఫిబ్రవరి 25 – అఫ్గానిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ – లాహోర్
ఫిబ్రవరి 26 – ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా – రావల్పిండి
ఫిబ్రవరి 27 – బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ – లాహోర్
ఫిబ్రవరి 28 – అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా – రావల్పిండి
మార్చి 1 – పాకిస్థాన్ వర్సెస్ భారత్ – లాహోర్
మార్చి 2 – దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ – రావల్పిండి
మార్చి 5 – సెమీ ఫైనల్ 1 – కరాచీ
మార్చి 6 – సెమీ ఫైనల్ 2 – రావల్పిండి
మార్చి 9 – ఫైనల్ – లాహోర్