×
Ad

Women’s World Cup Final: బ్యాటింగ్‌లో అదరగొట్టిన షఫాలీ వర్మ, దీప్తి శర్మ.. దక్షిణాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?

నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

Women’s World Cup Final: ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్-2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ముందు భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ తీసుకుంది.

నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో.. భారత బ్యాటర్లలో స్మృతీ మంధాన 45, షఫాలీ వర్మ 87, జెమిమా రోడ్రిగ్స్ 24, హర్మన్‌ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 58 (నాటౌట్), అమన్‌జోత్ కౌర్ 12, రిచా ఘోష్ 34, రాధా యాదవ్ 3 (నాటౌట్) పరుగులు తీశారు. దీంతో 50 ఓవర్లలో భారత్‌ స్కోర్‌ 7 వికెట్ల నష్టానికి 298గా నమోదైంది.

Also Read: Australia vs India: 4 సిక్సులు, 3 ఫోర్లు బాది టీమిండియాను గెలిపించిన వాషింగ్టన్ సుందర్‌

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆయాబోంగా ఖాకాకు 3, నాంకులులెకో మ్లాబా, నాడిన్ డి క్లార్క్, క్లోయ్ ట్రయాన్‌కు ఒక్కో వికెట్ చొప్పున దక్కాయి. కాగా, భారత్‌, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్కసారి కూడా విమెన్స్ వరల్డ్ కప్‌ను గెలుచుకోలేదు. ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ విమెన్ జట్లు మాత్రమే ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్నాయి.