Australia vs India: 4 సిక్సులు, 3 ఫోర్లు బాది టీమిండియాను గెలిపించిన వాషింగ్టన్ సుందర్
క్రీజులో జితేశ్ శర్మ అతడికి సపోర్టుగా నిలిచి 22 పరుగులు చేశాడు.
Australia vs India: ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఇవాళ బెల్లెరివ్ ఓవల్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ వరుసగా భారీ సిక్సులు, ఫోర్లు బాదుతూ టీమిండియాను గెలిపించాడు.
ఇతర బ్యాటర్లు విఫలమైన వేళ వాషింగ్టన్ సుందర్ నాలుగు సిక్సులు, మూడు ఫోర్లు బాది టీమిండియా గెలుపునకు మార్గాన్ని సుగమం చేశాడు. మొత్తం 49 పరుగులు బాదాడు. క్రీజులో జితేశ్ శర్మ అతడికి సపోర్టుగా నిలిచి 22 పరుగులు చేశాడు. ((Australia vs India))
Also Read: రైలులో ప్రయాణికులను పొడుచుకుంటూ వెళ్లిన ఉగ్రవాదులు.. వణికిపోతూ వాష్‌రూమ్‌లలో దాక్కున్న ప్యాసింజర్స్
దీంతో 5 టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత్ 1-1 విజయాలతో కొనసాగుతున్నాయి. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17, వాషింగ్టన్ సుందర్ 49 , జితేశ్ శర్మ 22 పరుగులు సాధించారు. దీంతో 18.3 ఓవర్లలో భారత్ స్కోరు 188-5గా నమోదైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు, స్టొయినిస్, జేవియర్ బార్ట్‌లెట్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
కాగా, ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 6, మిచెల్ మార్ష్ 11, జోష్ ఇంగ్లిస్ 1, టిమ్ డేవిడ్ 74, మిచెల్ ఓవెన్ 0, మార్కస్ స్టొయినిస్ 56 మాథ్యూ షార్ట్ 21 పరుగులు బాదారు. ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబే 1 వికెట్ పడగొట్టారు.
