India vs Sri Lanka: శ్రీలంకకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా

భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో శ్రీలంకకు టీమిండియా 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్‌మెన్ లో ఇషాన్ కిషన్ 37, శుభ్‌మన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజూ శాంసన్ 5, హార్దిక్ పాండ్యా 29, దీపక్ హూడా 41 (నాటౌట్), అక్షర్ పటేల్ 31 పరుగులు చేశారు.

India vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో శ్రీలంకకు టీమిండియా 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్‌మెన్ లో ఇషాన్ కిషన్ 37, శుభ్‌మన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజూ శాంసన్ 5, హార్దిక్ పాండ్యా 29, దీపక్ హూడా 41 (నాటౌట్), అక్షర్ పటేల్ 31 పరుగులు చేశారు.

దీంతో 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక, మహేశ్ తీక్షణ, చమిక, సిల్వా, హసరంగా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. కాగా, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా ఈ మ్యాచు ఆడుతోంది. టీమిండియా, శ్రీలంక మధ్య మొత్తం మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి వన్డే మ్యాచులు ప్రారంభమవుతాయి.

Viral Video: సర్కస్‌లో ట్రైనర్‌పై దాడి చేసి ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన పులి

ట్రెండింగ్ వార్తలు