Viral Video: సర్కస్‌లో ట్రైనర్‌పై దాడి చేసి ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన పులి

ఇటలీలో సర్కస్ జరుగుతోన్న సమయంలో బోనులో ట్రైనర్ ఓ పులితో విన్యాసాలు చేయిస్తున్నాడు. అదే సమయంలో మరో పులి వచ్చి ట్రైనర్ కాలికి గట్టిగా పట్టేసింది. దీంతో ట్రైనర్ పెనుగులాడుతూ కిందపడిపోయాడు. అనంతరం ఆ ట్రైనర్ వెనక నుంచి పులి దాడి చేసింది. అతడి మెడను నోటితో పట్టేసింది. నొప్పితో అతడు విలవిల్లాడిపోయాడు.

Viral Video: సర్కస్‌లో ట్రైనర్‌పై దాడి చేసి ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన పులి

Viral Video

Viral Video: ఓ సర్కస్ ట్రైనర్ పై పులి ఒక్కసారిగా దాడి చేసి ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించింది. సాధారణంగా పులులు ఎవరిపై అయినా దాడి చేస్తే వాటిని ట్రైనర్ లే నియంత్రిస్తారు. అయితే, ఇక్కడ ట్రైనర్ పైనే పులి దాడి చేసి కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇటలీలో సర్కస్ జరుగుతోన్న సమయంలో బోనులో ట్రైనర్ ఓ పులితో విన్యాసాలు చేయిస్తున్నాడు. అదే సమయంలో మరో పులి వచ్చి ట్రైనర్ కాలికి గట్టిగా పట్టేసింది. దీంతో ట్రైనర్ పెనుగులాడుతూ కిందపడిపోయాడు. అనంతరం ఆ ట్రైనర్ వెనక నుంచి పులి దాడి చేసింది. అతడి మెడను నోటితో పట్టేసింది. నొప్పితో అతడు విలవిల్లాడిపోయాడు.

ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ప్రేక్షకులు అందరూ భయంతో కేకలు వేశారు. ట్రైనర్ పేరు ఇవాన్ ఓర్ఫీ (31) అని తెలిసింది. అతడిని పులి బారి నుంచి మరో ట్రైనర్ రక్షించాడు. అనంతరం ఇవాన్ ఓర్ఫీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇవాన్ ఓర్ఫీ చాలా నైపుణ్యాలు ఉన్న ట్రైనర్ అయినప్పటికీ పులి బారిన పడ్డాడని సర్కర్ ప్రతినిధులు చెప్పారు.

Train Tickets: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే జనరల్ టిక్కెట్ బుకింగ్