India vs Sri Lanka: ఇప్పటి వరకు భారత్‌లో గెలవని శ్రీలంక జట్టు.. హెడ్ టూ హెడ్ రికార్డ్ ఇదే!

శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లకు సిద్ధమైంది.

India vs Sri Lanka:శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లకు సిద్ధమైంది. రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్(IND vs SL Test Series) మొదటి మ్యాచ్ మార్చి 4వ తేదీ నుంచి మొహాలీలో ప్రారంభం అవుతుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు తన పటిష్ట రికార్డును నిలబెట్టుకునేందుకు శ్రీలంకతో తలపడుతోంది.

సొంతగడ్డపై భారత్‌కు పటిష్ట రికార్డు:

ఇప్పటి వరకు భారత మైదానంలో టీమిండియా-శ్రీలంక మధ్య 20 టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 11 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అంటే ఇప్పటి వరకు భారత్‌లో భారత జట్టుపై శ్రీలంక ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు.

ఓవరాల్ రికార్డ్ ఏం చెబుతోంది..

పొరుగు దేశంపై టీమ్ ఇండియా జట్టు ప్రస్తుతం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య మొత్తం 44 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో భారత్ 20 మ్యాచ్‌లు, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మొత్తం 17 మ్యాచ్‌లు డ్రా అవ్వగా.. ఇప్పటి సిరీస్ కూడా అదే విధంగా భారత్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో పోలిస్తే టెస్ట్‌ల్లో భారత జట్టు చాలా బలంగా ఉంది. టీమ్ ఇండియాలో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికతో బలంగా ఉన్న జట్టు ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విరాట్‌కి 100వ టెస్టు:

మొహాలీలో జరిగిన టెస్టు విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ కాగా.. విరాట్ కోహ్లీ తన టెస్టును చిరస్మరణీయ టెస్ట్‌గా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. చాలాకాలంగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ ఈ 100వ టెస్టులో సెంచరీ సాధించే అవకాశం ఉందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు