×
Ad

india vs west indies : సిరాజ్ ఆన్ డ్యూటీ.. హడలెత్తిపోతున్న వెస్టిండీస్ బ్యాటర్లు.. టపటపా పడిపోతున్న వికెట్లు.. ఆ క్యాచ్ సూపర్ భయ్యా.. వీడియో వైరల్

india vs west indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైంది.

india vs west indies

india vs west indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోవడంతో వెస్టిండీస్ బ్యాటర్లు హడలెత్తిపోతున్నారు. క్రీజులోకి వచ్చినవారు వెంటవెంటనే పెవిలిన్ బాటపట్టారు.

 

ఓపెనర్లు తేజ్ నారాయణ్ చందర్‌పాల్ (0), జాన్ క్యాంప్‌బెల్ (8) వెంటవెంటనే ఔట్ అయ్యారు. చందర్‌పాల్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. క్యాంప్‌బెల్ జస్ర్పీత్ బుమ్రా బౌలింగ్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తరువాత.. అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టర్ చేజ్ (24)లను మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బంతులతో పెవిలియన్ బాటపట్టించారు. సిరాజ్ 11 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్‌దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో షాయ్ హోప్ ను బోల్తా కొట్టించాడు. అద్భుతమైన బంతితో హోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.


మధ్యాహ్నం 1గంట సమయానికి వెస్టిండీస్ జట్టు 32 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. క్రీజులో జె. గ్రీవ్స్, కే.పియర్ ఉన్నారు. వికెట్ కీపర్ ధ్రువ్ జువెల్ అద్భుతమైన క్యాచ్ లు అందుకొని క్యాంప్బెల్, చందర్ పాల్, రోస్టన్ చేజ్ లను పెవిలియన్ కు పంపించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Asia Cup Trophy: అప్పుడేమో ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకుపోయాడు.. ఇప్పుడు ఇస్తాడట.. కానీ..