×
Ad

IND vs WI : భారత్ ఆటగాళ్లతోనే ఆటలా.. ఓవరాక్షన్‌ చేస్తే ఇంతేమరి.. విండీస్‌ ప్లేయర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. క్షమాపణ చెప్పినా వదల్లేదు..

India vs West Indies :"మొదటి ఇన్నింగ్స్ లో వికెట్ తీయలేకపోయిన ఫ్రస్టేషన్లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వైపు విండీస్ బౌలర్ సీల్స్ ప్రమాదకరంగా

India vs West Indies

IND vs WI : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఐదు వికెట్లకు 518 డిక్లేర్డ్ చేయగా.. వెస్టిండీస్ జట్టు 248 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టు ఫాలో‌ఆన్ ఆడాల్సి వచ్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇంకా 97 పరుగులు వెనుకబడే ఉంది. అయితే, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ కు ఐసీసీ గట్టి షాకిచ్చింది.

ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం రోజు వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ జైస్వాల్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మ్యాచ్ లో భాగంగా తొలిరోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. జైస్వాల్ క్రీజులో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ 29వ ఓవర్లో జేడన్ సీల్స్ ఓవరాక్షన్ చేశాడు.

Also Read: Asia Cup Trophy : అట్లుంటది మనతోని.. ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకెళ్లిన నఖ్వీకి బిగ్ షాక్..

మొదటి ఇన్నింగ్స్ లో వికెట్ తీయలేకపోయిన ఫ్రస్టేషన్లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వైపు విండీస్ బౌలర్ సీల్స్ ప్రమాదకరంగా బంతిని విసిరాడు. ఆ బంతి జైస్వాల్ ప్యాడ్స్ పై బలంగా తాకింది. దీన్ని సీరియస్ గా పరిగణించిన ఐసీసీ సీల్స్ కు ఓ డీమెరిట్ పాయింట్ అలాట్ చేయడంతోపాటు అతని మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించింది.

ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఆర్టికల్ 2.9 నిబంధన ప్రకారం.. ఓ ఆటగాడు బంతిని లేదా ఏదైనా క్రికెట్ సామాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి కానీ, వారి సమీపంలోకి కానీ విసరకూడదు. అలా చేస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందకి వస్తుంది. వెస్టిండీస్ బౌలర్ జేడన్ సీల్స్ విషయంలో ఇదే జరిగింది.

అయితే, సీల్స్ తానుచేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. కావాలని నేను బంతిని జైస్వాల్ వైపు వేయలేదు.. రనౌట్ చేయాలని మాత్రమే బంతిని విసిరాను అంటూ రిఫరీ పైక్రాఫ్ట్‌కు వివరించాడు. అతని వాదనను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. ఇందుకు సంబంధించిన వీడియో పలుసార్లు పరిశీలించింది. జైస్వాల్ అప్పటికే క్రీజులో ఉన్నట్లు గుర్తించారు. రన్‌ఔట్ అయ్యే అవకాశం లేకపోయినా సీల్స్ కావాలనే బంతిని జైస్వాల్ వైపు విసిరాడని ఐసీసీ నిర్ధారించింది. దీంతో అతనికి ఓ డీమెరిట్ పాయింట్ తో పాటు మ్యాచ్ ఫీజులో 25శాతం కోతను ఐసీసీ విధించింది.