భారత్‌లో INDvAUS వన్డే మ్యాచ్.. ఎప్పుడంటే..

ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌ల గురించి చర్చిస్తోంది బీసీసీఐ.

  • Publish Date - April 12, 2019 / 12:49 PM IST

ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌ల గురించి చర్చిస్తోంది బీసీసీఐ.

ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌ల గురించి చర్చిస్తోంది బీసీసీఐ. 2020 సంవత్సరంలో ఇండియా.. ఆస్ట్రేలియాతో ఆడనున్న వన్డే మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 3వన్డేల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్‌ను ముందుగా ఆస్ట్రేలియాలో జరపాలని నిర్వహించినా ఎట్టకేలకు భారత్ లోనే ఆడాలని నిర్ణయించారట. 
Read Also : శ్రేయాస్ అయ్యర్‌కు తలనొప్పిగా మారిన ఢిల్లీ గాయాలు

వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడటాన్ని నిర్దారించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇందుకోసం ఆస్ట్రేలియా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉన్న సిరీస్‌ను కూడా వదిలేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘2020 సంవత్సరాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా ఆరంభించాలని అనుకున్నాం. కానీ, భారత్‌లో ఆడాలని అనుకున్న నిర్ణయాన్ని స్వగతిస్తున్నాం. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మా రిక్వెస్ట్‌కు పాజిటివ్ గా స్పందించింది’ అని తెలిపాడు. 

ఈ మ్యాచ్ ల కోసం వాయిదా వేసిన న్యూజిలాండ్‌తో జనవరి తర్వాత ఆడనుంది క్రికెట్ ఆస్ట్రేలియా. దీని కోసం బిగ్ బాష్ లీగ్ ను కూడా ప్లేయర్లు వదులుకోనున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన మ్యాచ్‌లను న్యూజిలాండ్‌లోనే ఆడాలని ఆస్ట్రేలియా క్రికెట్ ఆలోచిస్తుందని సమాచారం. 
Read Also : 21వేల మంది చిన్నారులతో ముంబై ఇండియన్స్ మ్యాచ్