India Womens Cricket
IND vs AUS Test : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) -2026 తరువాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు మూడు టీ20 మ్యాచ్ లతోపాటు మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. తాజాగా.. బీసీసీఐ టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన భారత మహిళా జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్‌లకు సంబంధించిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత మహిళా జట్టును శనివారం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల పేర్లను బీసీసీఐ వెల్లడించింది.
టెస్టు జట్టులో ప్రతీకా రావల్‌కు కూడా చోటు దక్కింది. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో స్మృతి మంధానకు ఒపెనింగ్ జోడీగా రాణించిన ప్రతీకా.. అనూహ్య రీతిలో గాయపడి కీలక మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆమె.. త్వరలో భారత మహిళా జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఓపెనింగ్ బ్యాటర్ షఫాలీ వర్మకు కూడా టెస్టు జట్టులో సెలెక్టర్లు స్థానం కల్పించారు.
భారత మహిళా జట్టు (ఏకైక టెస్టు మ్యాచ్ కోసం) ..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ శర్మ, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్‌గరే.
Here’s a look at #TeamIndia‘s squad for the Only Test against Australia in Perth 🙌#AUSvIND pic.twitter.com/I6mYnV3wdN
— BCCI Women (@BCCIWomen) January 24, 2026