India Women sanctioned for slow over rate in third ODI against Australia
Team India : భారత మహిళల క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది. శనివారం (సెప్టెంబర్ 20న) ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్ రేటు నమోదు చేయడమే అందుకు కారణం.
ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక్కొ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున రెండు ఓవర్లకు పది శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా రిఫరీ జీఎస్ లక్ష్మీ విధించారు.
టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ అభియోగాన్ని, శిక్షను అంగీకరించిందని, దీంతో తదుపరి దీనిపై ఎలాంటి విచారణ ఉండదని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
India have been fined for slow over-rate following the third and final ODI against Australia.https://t.co/JKzdN9mjTD
— ICC (@ICC) September 23, 2025
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. బెత్ మూనీ (138; 75 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో చెలరేగడంతో 47.5 ఓవర్లలో ఆసీస్ 412 పరుగులు చేసింది. ఆ తరువాత 413 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో స్మృతి మంధాన (125; 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించింది. దీప్తి శర్మ(72), హర్మన్‌ప్రీత్ కౌర్ (52) లు రాణించినప్పటికి భారత్‌కు ఓటమి తప్పలేదు.
Hardik Pandya : బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న భారీ రికార్డు..
ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.