INDW vs SAW : తొలి రోజే 500+ స్కోరు.. భార‌త మ‌హిళ‌ల రికార్డు స్కోరు

చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అద‌ర‌గొట్టింది

India Women vs South Africa Women : చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అద‌ర‌గొట్టింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 525 ప‌రుగులు చేసింది. దీంతో మ‌హిళ‌ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో మొద‌టి రోజు ఆట‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది. గ‌తంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ మ‌హిళ‌ల పేరిట ఉండేది. 1935లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మ‌హిళ‌లు తొలి రోజు 4 వికెట్ల న‌ష్టానికి 431 ప‌రుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్లుగా షెఫాలీ వ‌ర్మ‌, స్మృతి మంధాన బ‌రిలోకి దిగారు. షెఫాలీ (205; 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) డ‌బుల్ సెంచ‌రీతో వీర‌విహహారం చేయ‌గా మంధాన (149; 161 బంతుల్లో 27 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీతో క‌దం తొక్కింది. ఆరంభం నుంచే వీరిద్ద‌రు ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. పోటాపోటీగా బౌండ‌రీలు బాదారు. దీంతో స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది. టెస్టును వ‌న్డేలాగా మార్చారు. బంతి ప‌డితే బౌండ‌రీ అన్న‌ట్లుగా విధ్వంసం కొన‌సాగించారు. చూస్తుండ‌గానే ఇద్ద‌రూ శ‌త‌కాల‌ను పూర్తి చేసుకున్నారు.

IND vs SA : ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే విజేత ఎవ‌రంటే..?

వీరిద్ద‌రి ఔట్ చేసేందుకు ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. ఆఖ‌రికి జ‌ట్టు స్కోరు 292 ప‌రుగుల వ‌ద్ద మంధాన ర‌నౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్ర‌మంలో తొలి వికెట్‌కు అత్య‌ధిక ప‌రుగులు జోడించిన జోడీగా మంధాన‌-షెఫాలీ జోడి చ‌రిత్ర సృష్టించింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సుభా స‌తీశ్ (15) విఫ‌లం కాగా.. జెమీమా రోడిగ్స్ (55) హాఫ్ సెంచ‌రీ బాదింది. షెఫాలీ వ‌ర్మ 194 బంతుల్లో త‌న టెస్టు కెరీర్‌లో తొలి డ‌బుల్ సెంచ‌రీని అందుకుంది.

తొలి రోజు ఆట ముగిసే స‌మయానికి హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (42), రిచా ఘోష్ (43) లు ఉన్నారు.

MS Dhoni : ధోని న్యూ హెయిర్ స్టైల్ అదుర్స్‌.. 10 ఏళ్లు త‌గ్గిపోయిన‌ట్లు ఉన్నాయ్‌గా..!

ట్రెండింగ్ వార్తలు