IND vs SA : ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే విజేత ఎవ‌రంటే..?

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది.

IND vs SA : ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే విజేత ఎవ‌రంటే..?

If IND vs SA T20 World Cup final match abandoned due to rain what is happening

India vs South Africa : పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. శ‌నివారం భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు బార్బ‌డోస్ వేదిక కానుంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాల‌ని భార‌త జ‌ట్టు ఆరాట‌ప‌డుతోంది. తొలిసారి ఫైన‌ల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా మొద‌టి సారి విశ్వ విజేత‌గా నిల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.

అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. అక్యూవెద‌ర్ నివేదిక ప్ర‌కారం శ‌నివారం బార్బ‌డోస్‌లో 78 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం శ‌నివారం తెల్ల‌వారుజాము 3 నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఉరుముల‌తో కూడిన వ‌ర్షం ప‌డే అవ‌కాశం దాదాపు 50 శాతంగా ఉన్న‌ట్లు తెలిపింది. ఇక 11 గంట‌ల‌కు 60 శాతం, మ‌ధ్యాహ్నం 12 నుంచి 3 వ‌ర‌కు 40 శాతంగా ఉన్న‌ట్లుగా పేర్కొంది.

MS Dhoni : ధోని న్యూ హెయిర్ స్టైల్ అదుర్స్‌.. 10 ఏళ్లు త‌గ్గిపోయిన‌ట్లు ఉన్నాయ్‌గా..!

ఒక‌వేళ వ‌ర్షం కార‌ణంగా శ‌నివారం మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోతే ప‌రిస్థితి ఏంటి అన్న సందేహం అక్క‌ర‌లేదు. ఎందుకంటే ఐసీసీ ఫైన‌ల్ మ్యాచ్‌కు రిజ‌ర్వ్‌డేను ఎప్పుడో ప్ర‌క‌టించింది. శ‌నివారం మ్యాచ్ జ‌రిగే ప‌రిస్థితులు లేకుంటే ఆదివారం నిర్వ‌హిస్తారు. అయితే.. ఇక్క‌డ బ్యాడ్‌న్యూస్ ఏంటంటే..? ఆదివారం కూడా బార్బ‌డోస్‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు అక్యూవెద‌ర్ తెలిపింది.

ఒక వేళ ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగిస్తే.. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో విజేత‌ను నిర్ణ‌యించాల్సి వ‌స్తే ఇరు జ‌ట్లు క‌నీసం 10 ఓవ‌ర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ రెండు రోజుల్లో కూడా మ్యాచ్ జ‌రిగే ప‌రిస్థితులు లేన‌ట్లు అయితే అప్పుడు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తారు. ఇరు జ‌ట్లు అంటే భార‌త్‌, ద‌క్షిణాఫ్రికాను సంయుక్త విజేత‌గా ప్ర‌క‌టిస్తారు.

IND vs ENG : ఇట్స్ టైమ్ ఫ‌ర్ ల‌గాన్‌.. ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా స్వీట్ రివెంజ్‌.. మీమ్స్ వైర‌ల్‌..