×
Ad

India Women vs Sri Lanka Women : అదరగొట్టిన అమ్మాయిలు.. మెరిసిన శ్రీ చరణి.. దంచికొట్టిన షెఫాలీ.. విశాఖలో శ్రీలంక మళ్లీ చిత్తు

India Women vs Sri Lanka Women : భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. విశాఖపట్టణం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక మహిళ జట్టును

India Women vs Sri Lanka Women

India Women vs Sri Lanka Women: భారత మహిళల జట్టు, శ్రీలంక మహిళల జట్ల మధ్య మంగళవారం విశాఖపట్టణం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్ట ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తద్వారా శ్రీలకం జట్టుపై ఏడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. పలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత మహిళల జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. విశాఖపట్టణం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక మహిళ జట్టును చిత్తు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. తెలుగమ్మాయిశ్రీ చరణి (2/23)తో పాటు వైష్ణవి శర్మ (2/32), స్నేహ్‌ రాణా (1/11), క్రాంతి గౌడ్‌ (1/21) సత్తా చాటడంతో శ్రీలంక బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. 129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత మహిళల జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


స్మృతిమంధాన (14) తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ.. షెఫాలి వర్మ అదరగొట్టింది. కేవలం 34బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సు సహాయంతో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. మరోవైపు.. జెమీమా 15 బంతుల్లో 26 పరుగులు చేసింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ సింగ్ (10) చేసింది. జెమీమాతో రెండో వికెట్ కు 58 పరుగులు జోడదించిన షెపాలీ వర్మ.. మూడో వికెట్ కు 45 పరుగులు జత చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది.

షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. మూడో టి20 తిరువనంతపురంలో ఈ నెల 26న జరుగనుంది.