Womens Asia Cup 2026 : ఆసియాకప్ తీసుకునేందుకు నిరాకరించిన భారత్.. 8వ సారి గెలిచి మరీ.. హర్మన్ ప్రీత్ సేన అలా ఎందుకు చేసిందంటే?
మహిళల ఆసియాకప్ 2026 విజేతగా (Womens Asia Cup 2026) భారత్ నిలిచింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 14, 2026 / 08:10 AM IST
India womens team refuses to take Asia Cup trophy from Mohsin naqvi
Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే కప్పును ముద్దాడింది. కాగా.. భారత మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో షఫాలీ వర్మ (68; 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మృతి మంధాన (59; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిథాలీ అయోధ్య, చమరి ఆటపట్టు, చాముడి ప్రభోద లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
All smiles in Dubai 😁
A dominating show by #TeamIndia as they beat Sri Lanka by 7⃣2⃣ runs to clinch their 8⃣th #WomensAsiaCup title 🏆
Scorecard ▶️ https://t.co/knKLXGSfOd #INDvSL pic.twitter.com/vwLmZZcUUD
— BCCI Women (@BCCIWomen) September 13, 2026
అనంతరం 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (36; 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో తెలుగు అమ్మాయి శ్రీచరణి నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించింది. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. షఫాలీ వర్మ, ప్రేమ్ రావత్, క్రాంతి గౌడ్ లు తలా ఓ వికెట్ తీశారు.
కప్పు తీసుకునేందుకు నిరాకరించిన భారత్..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆ దేశ మంత్రి అయిన మోసిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు నిరాకరించింది. దీంతో ఆయన స్టేడియాన్ని వదిలి వెళ్లిపోయాడు. గతేడాది పురుషుల ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కూడా నఖ్వి చేతుల మీదుగా కప్పు తీసుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ మంత్రి చేతుల మీదుగా కప్పు తీసుకునేందుకు టీమ్ఇండియా నిరాకరిస్తోంది.
