T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో యూఎస్‌ఏపై టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.
యూఎస్‌ఏ ముందు భారత్ 162 పరుగుల లక్ష్యం ఉంచింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 20, అభిషేక్ శర్మ 0, తిలక్ వర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 84, శివమ్ దూబే 0, రింకు సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5, అక్షర్ పటేల్ 14, అర్ష్‌దీప్ సింగ్ 4, వరుణ్ చక్రవర్తి 0 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ షాల్క్‌విక్ 4, హర్మీత్ సింగ్ 2, అలీ ఖాన్, మోహ్షిన్ తలో వికెట్ తీశారు.
లక్ష్యఛేదనంలో యూఎస్‌ఏ తడబడింది. ఆండ్రీస్ గౌస్ 6, సాయితేజ ముక్కమల్ల 2, మోనాంక్ పటేల్ 0, మిలింద్ కుమార్ 34, సంజయ్ కృష్ణమూర్తి 37, శుభమ్ రంజానే 37, హర్మీత్ సింగ్ 0, మొహమ్మద్ మొహ్సిన్ 8, షాడ్లీ వాన్ షాల్క్విక్ 2 పరుగులు చేశారు. దీంతో యూఎస్‌ఏ స్కోరు 20 ఓవర్లలో 132/8గా నమోదైంది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు.